దుర్మార్గుడు.. ఎద్దుతో బతికున్న కోడిని బలవంతంగా తినిపించిన యూట్యూబర్.. వైరల్..
ఎద్దును బలవంతంగా కోడికి తినిపించిన వీడియోను పోస్ట్ చేసిన యూట్యూబర్ పై (YouTuber who force-fed a surviving chicken to a bull)తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు (Tamilnadu police registered a case). జల్లికట్టు ఎద్దుకు బతికున్న కోడికి ఆహారంగా ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ (video viral) అవుతోంది. దీనిపై జంతు హక్కుల కార్యకర్తలు ఫిర్యాదు చేయడంతో అతడి కేసు నమోదు అయ్యింది.
యూట్యూబర్ లు చేసే తుంటరి పనులకు హద్దే లేకుండా పోతోంది. కొందరు యూట్యూబర్లు మంచి సమాచారం, నాలెడ్జ్ ఉన్న కంటెంట్ ఇస్తుంటే మరి కొందరు మాత్రం దానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కువ వ్యూవ్స్ పెంచుకోవడం కోసం చిల్లర చేష్టలకు పాల్పడుతున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ యూట్యూబర్ ఓ ఎద్దుకు బతికున్న కోడిని బలవంతంగా తినిపించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు అతడిపై మండిపడుతున్నారు. దీంతో పోలీసులు ఆ యూట్యూబర్ పై కేసు నమోదు చేశారు.
‘‘నేను చిన్నప్పుడు ఇలాంటి ఇంట్లో ఉండి ఉంటే’’- స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ.. వైరల్
ఇటీవల సేలం జిల్లాలో ఈ ఘటన జరిగింది. దీనిపై జంతు హక్కుల కార్యకర్త, చెన్నైకి చెందిన జంతు సంరక్షణ సంస్థ పీపుల్ ఫర్ క్యాటిల్ ఇన్ ఇండియా (పీఎఫ్సీఐ) వ్యవస్థాపకుడు అరుణ్ ప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. జల్లికట్టు కోసం శిక్షణ పొందుతున్న ఎద్దుకు బతికున్నకోడికి బలవంతంగా తినిపిస్తున్న వీడియోను ఆ యూట్యూబర్ రెండు రోజుల కిందట అప్ లోడ్ చేశాడని, దాని ప్రకారం ఫిర్యాదు చేస్తున్నట్టు అరుణ్ ప్రసన్న తరమంగళం పోలీసులకు లేఖ రాశారు.
శాకాహార జంతువుకు పచ్చి మాంసాన్ని బలవంతంగా తినిపించడం వల్ల కడుపులో సాల్మొనెల్లా బ్యాక్టీరియా చేరే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం 1960, సెక్షన్ 429, సెక్షన్ 3, 11(1) (ఎ), 11 (1) (ఐ) కింద రఘు, అతడి అనుచరులపై తారామంగళం పోలీసులు కేసు నమోదు చేశారు.
సర్పంచ్ లకు చెల్లించాల్సిన బిల్లులను బీఆర్ఎస్ పక్కదారి పట్టించింది - మంత్రి సీతక్క
ఆ వీడియోలో ఏముందంటే..?
యూట్యూబర్ రఘు సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేసిన 2.48 నిమిషాల వీడియోలో ముగ్గురు వ్యక్తులు ఎద్దును అదుపులో ఉంచడానికి నియంత్రిస్తున్నారు. అదే సమయంలో మరో వ్యక్తి కోడిని దాని నోటిలో బతికున్న కోడిని పెట్టి, ఎద్దుతో తినిపించారు. కాగా.. తమిళనాడులో సంప్రదాయ ఎద్దుల పందెం అయిన జల్లికట్టును నిర్వహిస్తుంటారు.
అయితే ఎద్దుల ప్రదర్శనను పెంచాలనే ఉద్దేశంతో కోడిని ఆహారంగా ఇచ్చారని జంతు హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. ఈ జల్లికట్టులో గెలిచిన ఎద్దులకు, వాటి యజమానులకు బంగారు నాణేలతో పాటు పలు బహుమతులు అందిస్తారు. ఈ పోటీల్లో విజయం సాధించిన ఎద్దులకు, వాటి సంతానోత్పత్తి సామర్థ్యానికి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అందుకే ఈ పోటీల్లో గెలిపించేందుకు వాటి యజమానులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.