‘‘నేను చిన్నప్పుడు ఇలాంటి ఇంట్లో ఉండి ఉంటే’’- స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ.. వైరల్
ప్రధాని నరేంద్ర మోడీ మహారాష్ట్ర పర్యటనలో భావోద్వేగానికి లోనయ్యారు (Prime Minister Narendra Modi gets emotional during his visit to Maharashtra). స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. పీఎంఏవై-అర్బన్ (PMAY-Urban scheme) కింద పూర్తయిన ఇళ్లను లబ్దిదారులకు అందించే కార్యక్రమంలో ఆయన పాల్గొని తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
PM Modi gets emotional : మహారాష్ట్రలో పర్యటనలో ప్రధాని మోడీ కన్నీళ్లు పెట్టుకున్నారు. పీఎంఏవై-అర్బన్ కింద పూర్తయిన 90,000 ఇళ్లను లబ్దిదారులకు అందించే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ భావోద్వేగానికి గురయ్యారు. స్టేజీపైనే కన్నీటి పర్యంతమయ్యారు. ఉబికి వస్తున్న దు:ఖాన్ని దిగమింగుకొని కొంత సమయం తరువాత ఆయన ప్రసంగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బిల్కిస్ బానో కేసు దోషులకు చుక్కెదురు.. ఆదివారంలోగా లొంగిపోవాలని ఆదేశించిన సుప్రీంకోర్టు
ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించారు. షోలాపూర్ లోని రాయ్ నగర్ హౌసింగ్ సొసైటీలో పీఎం ఆవాస్ యోజన- అర్భన్ పథకం కింద కొత్తగా నిర్మించిన 15 వేల ఇళ్లను చేనేత కార్మికులు, విక్రేతలు, పవర్ లూమ్ కార్మికులు, చెత్త ఏరుకునేవారు, బీడీ కార్మికులు, డ్రైవర్లు తదితరుల లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా షోలాపూర్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ... పీఎం ఆవాస్ యోజన కింద దేశంలోనే అతిపెద్ద సొసైటీ ప్రారంభోత్సవం జరిగిందని అన్నారు.
ఈ క్రమంలో తన చిన్ననాటి రోజులను ప్రధాని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కన్నీటిని ఆపుకుంటూ.. ‘‘నేను ఆ ఇళ్లను చూడటానికి వెళ్ళాను. నేను చిన్నప్పుడు అలాంటి ఇంట్లో నివసించే అవకాశం ఉంటే బాగుండేది. వేలాది కుటుంబాల కలలు నెరవేరాయని చూసినప్పుడు తృప్తిగా అనిపిస్తుంది. వారి ఆశీస్సులే నాకు పెద్ద ఆస్తి’’ అని ప్రధాని మోడీ అన్నారు.
అసంఖ్యాక కుటుంబాల జీవితాలపై బీఎమ్ ఎవై-అర్బన్ పథకం మంచి ప్రభావాన్ని చూపిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నిరుపేదలకు అందుబాటు ధరల్లో ఇళ్లు అందించాలన్న తమ నిబద్ధతలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అని అన్నారు. చారిత్రకంగా సమాజంలో అట్టడుగున ఉన్న వారి జీవన ప్రమాణాలు పెంపొందించాలన్న ప్రభుత్వ చిత్తశుద్ధికి ఈ ఇళ్లు పూర్తి కావడమే నిదర్శనమన్నారు.
సర్పంచ్ లకు చెల్లించాల్సిన బిల్లులను బీఆర్ఎస్ పక్కదారి పట్టించింది - మంత్రి సీతక్క
రాముడి నిజాయతీతో కూడిన పాలనా సూత్రాల స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తోందని, జనవరి 22న రామజ్యోతిని వెలిగించాలని పిలుపునిచ్చారు. మోడీ అంటే గ్యారంటీ అని, పూర్తయ్యే గ్యారంటీ అని అర్థమని ప్రధాని అన్నారు. ఇచ్చిన హామీలను గౌరవించాలని శ్రీరాముడు బోధించాడని, పేదల సంక్షేమం, వారి సాధికారత కోసం తాము నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను నెరవేరుస్తున్నామని చెప్పారు.