అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళుతున్న తెలంగాణ రాష్ట్ర సమితికి కాలం కలిసిరావడం లేదా అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇటీవలి కాలంలో జరిగిన రెండు సంఘటనలను ఉదాహరణగా తీసుకుని కొందరు ఏదేదో ఊహించుకుంటున్నారు. 

ఒక ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. ‘‘తమ పార్టీ ఓడిపోతే నాకేమి నష్టం లేదని.. ఇంటికాడ పడుకుని రెస్ట్ తీసుకుంటాన్నారు’’. ఆ తర్వాత ఆయన కుమారుడు కేటీఆర్ ఉప్పల్‌లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఆయన రాక సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా గులాబీ రంగు గ్యాస్ బెలూన్లు ఏర్పాటు చేశారు. 

ఈ క్రమంలో అవి ఒక్కసారిగా పేలిపోవడంతో పలవురు గాయపడగా.. కొందరు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఓటమి గురించి కేసీఆర్ మాట్లాడటం, కేటీఆర్ రోడ్‌షోలో బెలూన్లు పేలడం శుభ సూచికం కాదని టీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. 

ఆ చర్చ కాస్తా సోషల్ మీడియాకు చేరడంతో వైరల్ అవుతోంది. అయితే స్వతహాగా పూజలు, జాతకాలు, ముహూర్తాలను బాగా విశ్వసించే కేసీఆర్.. ఇందుకు తగిన శాంతి పూజలను కూడా చేయించి వుంటారని కొందరు కామెంట్ చేస్తున్నారు.

గెలుపు ఎవరిది: కేసీఆర్ దా, సెంటిమెంటుదా?

కేసీఆర్ కి ఓటమి భయం పట్టుకుంది.. కోమటిరెడ్డి

కేసీఆర్ మొక్కను నరికేశారు

సెటిలర్ల ఓట్లకు గాలం: కేసీఆర్ వ్యూహం ఇదీ

కేసీఆర్ గెలుపుకోసం ఏపీలో పూజలు

ఓడిపోతే.. ఇంట్లో పడుకొని రెస్ట్ తీసుకుంటా.. కేసీఆర్ (వీడియో)

కేటీఆర్ రోడ్డుషో లో అపశృతి, కార్యకర్తలకు గాయాలు (వీడియో)

కేటీఆర్ రోడ్ షోలో అపశృతి.. ఆరుగురు నేతలకు గాయాలు