తెలంగాణలో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఏపీలో పూజలు చేస్తున్నారు. గతంలో విజయవాడలో కేసీఆర్ కి ఆయన అభిమానులు పాలాభిషేకం చేసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. కాగా.. ఇప్పుడు ఆయన గెలుపు కోసం పూజారులు కూడా ఆలయాల్లో పూజలు చేస్తుండటం గమనార్హం.

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఆ ఆలయ పూజారులు కేసీఆర్ కోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కేసీఆర్ కారణంగా తెలంగాణ ఆలయంలో మహర్దశ పట్టిందని.. అలాంటి పాలకుడు తమకు లేకపోవడం తమ దురదృష్టమని ఆ పూజారులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కు కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి అయి, తమ రాష్ట్రంలోని ఆలయాలను కూడా అభివృద్ధి చెయ్యాలని తాము కోరుకుంటున్నట్లు వారు చెప్పారు.

ఇక పెనుగంచిప్రోలు ఆలయ పూజార్లు కూడా ఇదే మాట చెప్పడం విశేషం. తెలంగాణకు మళ్లీ మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని కోరుకున్నారు. ఆయన మళ్లీ సీఎం అయ్యాక తమ ఆలయాన్ని సందర్శించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దీనిని బట్టి.. కేసీఆర్ చరీష్మా..తెలంగాణలో మాత్రమే కాదు.. ఏపీలో కూడా బాగానే ఉందని తెలుస్తోంది. మరి వీరి ప్రార్థనలు ఫలించి ఆయన ముఖ్యమంత్రి అవుతారో లేదో వేచి చూడాలి.