తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపడుతున్న రోడ్ షోలో అపశృతి చోటుచేసుకుంది. బుధవారం కేటీఆర్ రోడ్ షోలో  పాల్గొనడానికి వచ్చిన ఆరుగురు పార్టీ నేతలు గాయాలపాలయ్యారు. హైడ్రోజన్ బెలూన్స్ పేలి ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గురువారం  సాయంత్రం కేటీఆర్ ఉప్పల్ లో రోడ్ షో చేపట్టారు. ఆయన రోడ్ షోకి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు.. వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వారంతా గులాబి రంగు జెండాలు, హీలియం వాయివు నింపిన పింక్ కలర్ బెలూన్స్ పట్టుకొని ఆయనకు స్వాగతం పలికేందుకు రెడీగా ఉన్నారు.

ఈ క్రమంలో ఓ వ్యక్తి హీలియం వాయివు నింపిన బెలూన్స్ కి బదులు హైడ్రోజన్ వాయివు నింపిన బెలూన్స్ ని గాలిలోకి వదిలాడు. అవి వెంటనే బ్లాస్ట్ అవ్వడంతో దాదాపు ఆరుగురు పార్టీ కార్యకర్తలు గాయాలపాలయ్యారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ కి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

దీంతో.. వెంటనే స్పందించిన ఇతర నేతలు.. గాలయాలపాలైన కార్యకర్తలను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్ప్రతికి చికిత్స నిమిత్తం తరలించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాచకొండ పోలీసులు తెలిపారు.  అచ్చం ఇలాంటి ఘటనే అక్టోబర్ 8న రాహుల్ గాంధీ జబల్ పూర్ పర్యటనలో  చోటుచేసుకోవడం గమనార్హం. 

                         "