తెలంగాణ సీఎం కేసీఆర్ నాటిన మొక్కను నరికేశారు. మొదటి విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా కేసీఆర్  కరీంనగర్ జిల్లా తదిమ్మపూర్  మండలం ఎల్ఎండీ కరకట్ట దిగువన ఒక మొక్కను నాటిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ మొక్క మూడేళ్లలో చాలా ఎత్తుగా బలంగా పెరిగింది.

అయితే ఆ మొక్కను గుర్తుతెలియని వ్యక్తులు నరికేశారు. బుధవారం వరకు బాగానే ఉన్నచెట్టు.. గురువారానికి నేలకు ఒరిగిపోయింది. చెట్టును నరికేసి.. పక్కనే వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.. కావాలనే చెట్టును నరికేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారు ఘటనాస్థలిని పరిశీలించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.