స్నానం చేస్తుండగా వీడియో.. బ్లాక్ మెయిల్ చేసి బాలికపై పలుమార్లు అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
బాలికపై పలుమార్లు లైంగిక దోపిడికి పాల్పడ్డ వ్యక్తికి జైలు శిక్ష పడింది. 2018లో జరిగిన ఘటనకు సంబంధించి తాజాగా కోర్టులో నిందితుడికి శిక్ష ఖరారు అయ్యింది. 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల ఫైన్ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
ఓ బాలికను పలుమార్లు అత్యాచారం చేసిన వ్యక్తికి కోర్టు శిక్ష విధించింది. అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల ఫైన్ విధించింది. ఈ మేరకు నాంపల్లి పోక్సో కోర్టు జడ్జి అనిత శుక్రవారం తీర్పు వెలువరించారు. 2018లో ఈ ఘటన చోటు చేసుకుంది. పలు మార్లు వాదోపవాదాల తరువాత తాజాగా తీర్పు వచ్చింది. ఈ కేసులో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ చిలకలగూడ ప్రాంతంలో ఓ బాలిక తన అమ్మమ్మతో కలిసి జీవించేది. ఆ ఇంటికి సమీపంలోనే 40 ఏళ్ల మాణిక్యరావు అనే వ్యక్తి నివసించేవాడు.
ఫేక్ మెసేజ్ కు భయపడి స్టూడెంట్ ఆత్మహత్య.. ఇంతకీ దానిని ఎవరు పంపించారు..? అందులో ఏముందంటే ?
అయితే ఆ బాలికపై అతడు కన్నేశాడు. ఆమె స్నానం చేస్తున్న సమయంలో, బట్టలు మార్చుకుంటున్నప్పుడు దొంగచాటుగా తన ఫోన్ లో ఉన్న కెమెరా ద్వారా వీడియో తీశాడు. తరువాత వాటిని బాలికకు చూపించాడు. ఆ వీడియోల ఆధారంగా బాలికను బ్లాక్ మెయిల్ చేశాడు. పలుమార్లు ఆమెను అత్యాచారం చేశాడు. అయితే 2018లో ఏప్రిల్ లో బాలిక అనారోగ్యం పాలైంది. తనకు కడుపులో నొప్పి వేస్తుందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో చేర్పించారు.
పిడుగుల వాన బీభత్సం.. ఆదిలాబాద్ లో ముగ్గురు, ములుగులో ఒకరు మృతి.. పలు మూగ జీవాల మృత్యువాత
పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలికపై లైంగిక దాడి జరిగిందని తెలిపారు. ఏం జరిగిందని బాధితురాలిని ఆరా తీశారు. దీంతో పక్కింట్లో నివసించే మాణిక్యరావు తనపై జరిపిన లైంగిక దాడిని వివరించింది. ఈ విషయంలో బాలిక అమ్మమ్మ చిలకలగూడ పోలీసులు స్టేషన్ ను ఆశ్రయించింది. ఈ ఘటనపై ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని భరోసా సెంటర్ కు తీసుకెళ్లారు. అక్కడ ఆమె వాంగ్మూలం నమోదు చేశారు. తరువాత నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రిమాండ్ కు తరలించారు.
‘కూతురు కోసం లండన్ వెళ్లిన సీఎం జగన్.. సాక్ష్యం చెప్పేందుకు కోర్టుకు రాలేరా ?’
ఈ కేసులో పోలీసులు సమగ్ర విచారణ జరిపి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టులో సుమారు ఐదు సంవత్సరాల పాటు ఈ కేసులో వాదోపవాదాలు జరిగాయి. సరైన అధారాలు ఉండటంలో నేరం నిరూపితమైంది. దీంతో మణిక్యరావుకు కోర్టు శిక్ష విధించింది. అతడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 వేల ఫైన్ ను ఖరారు చేశారు. ఈ మేరకు శుక్రవారం కోర్టు ఆదేశాలు వెలువరించింది. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేసిన పోలీసులు, సిబ్బందిని హైదరాబాద్ సీపీ అభినందించారు.