తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ గణాంకాల ప్రకారం గురువారం ఉదయం 8.30 గంటల వరకు లింగంపల్లిలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్, వెస్ట్ మారేడ్‌పల్లిలో 12.8 డిగ్రీల సెల్సియస్, బండ్లగూడలో 13.3 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. అనేక ఇతర ప్రాంతాల్లో 15-17 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హైదరాబాద్ : hyderabad నగరం చలి గుప్పిట్లో చిక్కుకుంది. మూడు రోజులుగా పెరుగుతున్న చలి నగరవాసులన్ని వణికిస్తుంది. మూడు రోజుల క్రితం 19 డిగ్రీల సెల్సియస్‌గా ఉన్న కనిష్ట ఉష్ణోగ్రత 13.5 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గడంతో నగరంలో చలిగాలులు వీస్తున్నాయి. దీంతో గురువారం అధికారికంగా Winter season ప్రారంభమైందని Department of Meteorology చెబుతోంది.
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ గణాంకాల ప్రకారం గురువారం ఉదయం 8.30 గంటల వరకు లింగంపల్లిలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్, వెస్ట్ మారేడ్‌పల్లిలో 12.8 డిగ్రీల సెల్సియస్, బండ్లగూడలో 13.3 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. అనేక ఇతర ప్రాంతాల్లో 15-17 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఇంటర్ ఫస్టియర్‌లో 51 శాతం మంది ఫెయిల్.. అందుకేనా ?
తెలంగాణపై ఈశాన్య గాలులు వీస్తున్న నేపథ్యంలో పాదరసం స్థాయిలు క్రమంగా తగ్గుతాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. “రాష్ట్రవ్యాప్తంగా ఉత్తర గాలులు వీచడం ప్రారంభించాయి. రానున్న కొద్ది రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని ఐఎండీ వాతావరణ నిపుణురాలు ఎ శ్రావణి తెలిపారు.
ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో చలితో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అంటున్నారు. ఒక్కసారిగా వాతావరణంలో ఈ మార్పులు రావడం వల్ల సీజనల్ వ్యాధులు విస్తరించే అవకాశం ఎక్కువగా ఉందని.. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, జలుబు, జ్వరం, దగ్గులాంటి వాటి బారిన పడుకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Hyderabad Accident: మందుబాబుల బీభత్సం... డివైడర్ పైనుండి గాల్లో పల్టీలు... మరో కారును ఢీకొన్న ఐ20