Telangana rains: భారీ వర్షాలు వరదలతో ఒక్క ములుగు జిల్లాలోనే 16 మంది మృతి..
Mulugu: తెలంగాణలో గతవారం కురిసిన కుండపోత వర్షాలకు అనేక మంది ప్రాణాలు కోల్పోగా, భారీగా ఆస్తి, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. పలు వంతెనలు కొట్టుకుపోగా, విద్యుత్ తీగలు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.

Telangana rains: గతవారం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ములుగు జిల్లాలో 16 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ వర్షాలు, వరదల పరిస్థితులను, ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను గురించి వివరించారు. వరద బాధితులను ఆదుకునేందుకు 30 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో కొండాయి, దొడ్ల, మల్యాల, మేడారం, నార్లాపూర్, ప్రాజెక్ట్ నగర్ తదితర ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని పేర్కొన్నారు. కుండపోత వర్షాలకు అనేక మంది ప్రాణాలు కోల్పోగా, భారీగా ఆస్తి, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. పలు వంతెనలు కొట్టుకుపోగా, విద్యుత్ తీగలు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి, దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.
పరిస్థితి చక్కబడే వరకు రెండు జతల దుస్తులు, బెడ్ షీట్లు, టవల్స్, చీరలు, హౌస్ కీపింగ్, వంట పాత్రలు వంటి సామాగ్రిని వరద బాధితులకు అందిస్తున్నట్లు తెలిపారు. గత వారంలో శుక్ర, శనివారాల్లో కురిసిన భారీ వర్షాలతో పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని మంత్రి వెల్లడించారు. రామడుగు మండలంలో ఆదివారం వరదల్లో పంటలు కొట్టుకుపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ.వినోద్ కుమార్ తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద నీరు చిన్న వాగు ద్వారా వంతెన కింద ప్రవహించాల్సి వచ్చింది. ప్రమాదవశాత్తు మోతెవాగు గ్రామంలోని వరి పొలాల్లోకి ఓ పెద్ద చెట్టు అడ్డుపడటంతో పొంగిపొర్లింది. సుమారు 30 నుంచి 40 ఎకరాల్లో వరి పంట కొట్టుకుపోయినట్లు సమాచారం. బాధిత రైతులతో మాట్లాడిన వినోద్ కుమార్ వారి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతుండటంపై ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు డాక్టర్ జీ.శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలు, వరదల కారణంగా డెంగ్యూ విజృంభించే అవకాశముందని హెచ్చరించారు. ఇప్పటి వరకు 2,315 డెంగీ జ్వరాలు వచ్చాయి. హైదరాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. 1000 మంది గర్భిణులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 250 మంది మహిళలు ప్రసవించారని తెలిపారు. ఆరోగ్య శాఖ విస్తృతంగా పారిశుధ్య ప్రక్రియను ప్రారంభించింది. ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి క్లోరినేటెడ్ నీటిని వాడాలని గ్రామస్తులకు సూచించారరని తెలిపారు.