తెలంగాణ కాంగ్రెస్ కొత్త టీమ్ రెడీ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి,  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లతో సుదీర్ఘ చర్చలు జరిపిన అదిష్టానం ఎట్టకేలకు టిపిసిసి కార్యవర్గాన్ని ప్రకటించింది. ఎవరెవరికి పార్టీ పదవులు దక్కాయో తెలుసా?

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు పదవుల పండగ సాగుతోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రాష్ట్ర కేబినెట్ లో చోటు దక్కింది... తాజాగా మరికొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,ఎంపీ, ఎమ్మెల్సీలతో పాటు సీనియర్ నాయకులకు పార్టీ పదవులు దక్కాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) కార్యవర్గాన్ని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC) ఖరారు చేసింది. ఈమేరకు పార్టీ పదవులు దక్కినవారి పేర్లతో పిసిసి కార్యవర్గాన్ని ప్రకటించారు. 

అయితే గతంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ తో పాటు పిసిసి కార్యవర్గ ప్రకటన వెలువడేది...కానీ ఈసారి ఆ పదవుల నియామకం జరగలేదు. కేవలం 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులతో టిపిసిసి కార్యవర్గ ప్రకటన వెలువడింది. పార్టీలో చాలాకాలంగా కొనసాగుతున్న సీనియర్లతో పిసిసి టీమ్ ను రెడీ చేసారు.

టిపిసిసి ఉపాధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు జానారెడ్డి తనయుడు, ప్రస్తుత ఎంపీ రఘువీర్ రెడ్డికి అవకాశం దక్కింది. ఇక ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు సారయ్యకు కూడా తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి దక్కింది. తెలంగాణ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జ, పర్ణిక రెడ్డి, మట్ట రాగమయికి అవకాశం కల్పించారు. పూర్తి లిస్ట్ ను కింద చూడండి.

 

Scroll to load tweet…