Asianet News TeluguAsianet News Telugu

తిత్లీ భీభత్సం...కొండచరియలు విరిగిపడి 12మది మృతి

ఆంధ్ర ప్రదేశ్ తో పాటు ఒడిషా రాష్ట్రాన్ని తిత్లీ తుఫాను వణికిస్తోంది. తాజాగా ఈ తుఫాను దాటికి కొండ చరియలు విరిగిపడి ఒడిషాలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ ప్రమాదంలో మరికొందరి ఆచూకీ గల్లంతయినట్లు అధికారులు తెలిపారు.
 
12 Killed, 4 Missing in Odisha as Heavy Rains
Author
Gajapati, First Published Oct 13, 2018, 12:58 PM IST

ఆంధ్ర ప్రదేశ్ తో పాటు ఒడిషా రాష్ట్రాన్ని తిత్లీ తుఫాను వణికిస్తోంది. తాజాగా ఈ తుఫాను దాటికి కొండ చరియలు విరిగిపడి ఒడిషాలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ ప్రమాదంలో మరికొందరి ఆచూకీ గల్లంతయినట్లు అధికారులు తెలిపారు.

ఒడిషాలోని తిత్లీ  తుఫాను ప్రభావిత ప్రాంతమైన గజపతి జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గొంగాబాడొ గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు భారీ వర్షం, ఈదురు గాలులకు తమ గుడిసెల్లో ఉండటం మంచిదికాదని సమీపంలోని ఓ సొరంగంలో తలదాచుకున్నారు. అయితే భారీ వర్షాలతో బాగా తడిసిన కొండచరియలు విరిగిపడటంతో వీరిలోని 12 మంది మృతిచెందినట్లు సమాచారం. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరికొందరు తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాలతో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాదంలో చికకుకున్న  వారిని  కాపాడటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వర్షం ఈ సహయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios