Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ సెక్యూరిటీపై తెలంగాణ పోలీస్ శాఖ చర్యలు...

తనకు ప్రాణ హాని ఉందంటూ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనకుండా ఇంటికే పరిమితమైన టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డికి ఎట్టకేలకు తెలంగాణ పోలీస్ శాఖ సెక్యూరిటీ పెంచింది. హైకోర్టు  ఆదేశాల మేరకు ఆయనకు 4 ప్లస్ 4 గన్ మెన్లను సెక్యూరిటీ ఇవ్వడంతో పాటు ఆయన పర్యటనల కోసం 2 ఎస్కార్ట్ వాహనాలను కూడా ఉన్నతాధికారులు కొడంగల్ కు పంపించారు. ఈ భద్రత ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఫలితాలు వెలువడే వరకు కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అప్పటివరకు రేవంత్‌కు ఈ భద్రత కొనసాగించనున్నారు.
 
telangana police department follows high court judgement on revanth security
Author
Kodangal, First Published Dec 1, 2018, 2:39 PM IST

తనకు ప్రాణ హాని ఉందంటూ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనకుండా ఇంటికే పరిమితమైన టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్  రేవంత్ రెడ్డికి ఎట్టకేలకు తెలంగాణ పోలీస్ శాఖ సెక్యూరిటీ పెంచింది. హైకోర్టు  ఆదేశాల మేరకు ఆయనకు 4 ప్లస్ 4 గన్ మెన్లను సెక్యూరిటీ ఇవ్వడంతో పాటు ఆయన పర్యటనల కోసం 2 ఎస్కార్ట్ వాహనాలను కూడా ఉన్నతాధికారులు కొడంగల్ కు పంపించారు. ఈ భద్రత ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఫలితాలు వెలువడే వరకు కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అప్పటివరకు రేవంత్‌కు ఈ భద్రత కొనసాగించనున్నారు.

గతంలో రేవంత్ తనకు ప్రత్యర్థుల నుండి ప్రాణహాని ఉందని.. భద్రత కల్పించాలని గతంలో హైకోర్టును ఆశ్రయించాడు.  రేవంత్ అభ్యర్థనపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ కేంద్ర బలగాలతో ఆయనకు భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  అయితే రేవంత్ భద్రత అంశం తమ పరిధిలోకి రాదని....కాబట్టి తమరి ఆదేశాలపై సవరించాలని కేంద్రం హైకోర్టులో అప్పీలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు కేంద్రం అప్పీలును అంగీకరించింది. 

ఈ మేరకు  గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ కోర్టు  తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రేవంత్ రెడ్డికి భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. ఆయనకు 4 ప్లస్ 4 భద్రతతో పాటు ఎస్కార్ట్ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ భద్రతను ఎన్నికలు ముగిసి, ఫలితాలు  వెలువడే వరకు కొనసాగించాలని కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. 

కోర్టు ఆదేశాలతో రేవంత్ భద్రతపై తాజాగా తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. తనకు ప్రాణహాని ఉందంటూ ప్రచారాన్ని నిలిపేసిన రేవంత్ భద్రత పెరిగింది కాబట్టి ఇక ప్రచారంలో పాల్గొంటారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు 

రేవంత్ రెడ్డి భద్రతపై హైకోర్టు తాజా ఆదేశాలివే....

మరోసారి హైకోర్టుకు రేవంత్...తమ ఆదేశాల అమలవడం లేదంటూ పిటిషన్

బయటకు రాను: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ ప్రభుత్వం నన్ను చంపాలని చూస్తోంది: రేవంత్ రెడ్డి

ఆర్కేనగర్ లాగా కొడంగల్ ఎన్నిక వాయిదాకు కుట్రలు : రేవంత్

కొడంగల్ ఐటీ దాడులపై సీల్డ్ కవర్ నివేదిక...: రజత్ కుమార్

కొడంగల్ లో భారీ నగదు పట్టివేత...టీఆర్ఎస్ అభ్యర్థి బంధువు ఫామ్‌హౌస్‌లో...

Follow Us:
Download App:
  • android
  • ios