కరీంనగర్:  కరీంనగర్ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను మహిళా ఓటర్లు ప్రభావితం చేయనున్నారు. జిల్లాలో 9,11,480 మంది ఓటర్లు ఉన్నారు.ఆ మూడు నియోజకవర్గాల్లో జనాభా తక్కువగా ఉన్నా.. ఓటర్లుగా పురుషుల కంటే మహిళలే ఓటర్లుగా నమోదయ్యారు.

 కరీంనగర్ జిల్లాలో 4,57,808 మహిళా ఓటర్లు, 4,53,618 పురుష ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.  జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు.ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు, పార్టీల గెలుపు ఓటములను మహిళా ఓటర్లు ప్రభావితం చేయనున్నారు.

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2,09,224 ఓటర్లున్నారు. ఇందులో మహిళా ఓటర్లు1,04,615 మంది ఉన్నారు. పురుష ఓటర్లు కేవలం 1,04,592 మంది మాత్రమే.

మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,02,504 మంది ఓటర్లున్నారు. వీరిలో 1,01,915 మహిళా ఓటర్లుంటే, 1,00,588 పురుష ఓటర్లున్నారు.చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గంలో 2,12,731 మంది ఓటర్లున్నారు. వీరిలో  1,08,246 మహిళా ఓటర్లుంటే, 1,04,482 మంది పురుష ఓటర్లున్నారు.

ఈ మూడు నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళల జనాభా తక్కువ. కానీ,ఈ మూడు నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా తమ ఓటు హక్కును నమోదు చేసుకొన్నారు.

సంబంధిత వార్తలు

వారసులు: తండ్రుల బాటలో ఆదిలాబాద్ నేతలు

నర్సంపేట: మద్దికాయల ఓంకార్‌ రికార్డ్ ఇదీ

ఇల్లెందు: డబుల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య

హేమాహేమీల అడ్డా: ఆ ప్రముఖులు ఇక్కడివారే

కారణమిదే: ఆ స్థానంలో ఇంతవరకు టీడీపీ గెలవలేదు