తనకు ప్రాణ హాని ఉందంటూ...ఎన్నికల ప్రచారాన్ని కూడా నిలిపివేసిన టిపిసిసి  వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి భద్రతపై హైకోర్టు తాజాగా తీర్ప వెలువరించింది. ఆయనకు భద్రత కల్పించాలని గతంలో సింగిల్ బెంచ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే రేవంత్ భద్రత అంశం తమ పరిధిలోకి రాదని....కాబట్టి తమ ఆదేశాలపై సవరించాలని కేంద్రం మరోసానీ హైకోర్టులో అప్పీలు చేసింది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన కోర్టు కేంద్రం అప్పీలును అంగీకరించింది. 

ఈ మేరకు  గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ కోర్టు  తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రేవంత్ రెడ్డికి భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశించింది. ఆయనకు 4 ప్లస్ 4 భద్రతతో పాటు ఎస్కార్ట్ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ భద్రతను ఎన్నికలు ముగిసి, ఫలితాలు  వెలువడే వరకు కొనసాగించాలని కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. 

రాజకీయ ప్రత్యర్థులు, సంఘ విద్రోహ శక్తులతో తనకు ముప్పు ఉన్నందున 4 ప్లస్‌ 4 భద్రత కల్పించాలని గతంలో రేవంత్ కోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు సింగిల్  బెంచ్...కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని ఎన్నికల సంఘం, కేంద్రానికి ఆదేశించింది. అయితే రేవంత్ భద్రత అంశం తమ పరిధిలోనిది కాదని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు అప్పీలు చేయడంతో సింగిల్ బెంచ్ తీర్పును సవరిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

మరిన్ని వార్తలు 

మరోసారి హైకోర్టుకు రేవంత్...తమ ఆదేశాల అమలవడం లేదంటూ పిటిషన్

బయటకు రాను: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ ప్రభుత్వం నన్ను చంపాలని చూస్తోంది: రేవంత్ రెడ్డి

ఆర్కేనగర్ లాగా కొడంగల్ ఎన్నిక వాయిదాకు కుట్రలు : రేవంత్

కొడంగల్ ఐటీ దాడులపై సీల్డ్ కవర్ నివేదిక...: రజత్ కుమార్

కొడంగల్ లో భారీ నగదు పట్టివేత...టీఆర్ఎస్ అభ్యర్థి బంధువు ఫామ్‌హౌస్‌లో...