కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాకే మహబూబ్ నగర్ రావాలి: మోడీపై కేటీఆర్ ఫైర్
అవకాశం దొరికినప్పుడల్లా తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీ విషం చిమ్ముతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
హైదరాబాద్: కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చాకే మహబూబ్ నగర్ కు ప్రధాని మోడీ రావాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీ బీజేపీ అని ఆయన విమర్శించారు.మంగళవారంనాడు హైద్రాబాద్ లోని తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.ఈ ఏడాది అక్టోబర్ 1న మహబూబ్ నగర్ లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ పర్యటన విషయమై కేటీఆర్ స్పందించారు.
అవకాశం వచ్చినప్పుడుల్లా తెలంగాణపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషం చిమ్ముతున్నారని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణపై ప్రధాని మోడీ నరేంద్ర మోడీ కించపరుస్తున్నారన్నారు. 14 ఏళ్లు కేసీఆర్ పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.తెలంగాణను పదే పదే కించపరుస్తున్న మోడీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు.తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు కూడ జాతీయ హోదా ఇవ్వలేదన్నారు.
అమృతకాల సమావేశాలంటూ తెలంగాణపై ప్రధాని మోడీ విషం కక్కారన్నారు. కొత్త పార్లమెంట్ భవనంలో తెలంగాణపై విషం కక్కారని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోడీ గతంలో చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన మోడీ క్షమాపణ చెప్పాలన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎందుకు పదే పదే అవమానిస్తున్నారని మోడీని కేటీఆర్ ప్రశ్నించారు.తెలంగాణపై ఎందుకు అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారో చెప్పాలన్నారు. సమయం దొరికితే తెలంగాణ అగౌరవపరుస్తున్నారని ప్రధాని తీరుపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
also read:ఏపీ రాజకీయాలతో తెలంగాణకు ఏం సంబంధం?: చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్
తెలంగాణ ప్రజల ఓట్లు కావాలంటే ప్రజలకు మంచి చేయాలని ఆయన కోరారు.ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మరన్నారు. మహబూబ్ నగర్ కు ఏం చేశారో చెప్పాలని ప్రధానిని కేటీఆర్ అడిగారు. 10 ఏళ్ల నుండి కృష్ణా జలాల్లో తెలంగాణా వాటా తేల్చని విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు సుప్రీంకోర్టులో తాము దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కు తీసుకున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఒక్కదానికి కూడ జాతీయ హోదా ఇవ్వలేదన్నారు.