హైదరాబాద్:  చంద్రబాబునాయుడు అడ్డుపడకపోతే  18 ఏళ్ల క్రితమే తెలంగాణ వచ్చేదని  తెలంగాణ  రాష్ట్ర అపద్దర్మ మంత్రి హరీష్ రావు చెప్పారు. 


సోమవారం నాడు టీఆర్ఎస్ భవన్‌లో తెలంగాణ అపద్దర్మ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.

2009 ఫిబ్రవరి5 వతేదీన అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి అద్వానీ చేసిన ప్రకటనను హరీష్ రావు ప్రస్తావించారు. చంద్రబాబు వల్లే  గతంలో తాము తెలంగాణను ఇవ్వలేదని అద్వానీ చెప్పారు. యశ్వంత్ సిన్హా కూడ ఇదే విషయాన్ని చెప్పారని ఆయన చెప్పారు. 

చంద్రబాబునాయుడు అడ్డుపడకపోతే  18 ఏళ్ల క్రితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి  చంద్రబాబునాయుడు  సీఎంగా ఉన్న  కాలంలో  అసెంబ్లీలో తెలంగాణ గురించి మాట్లాడితే  అసెంబ్లీ  నుండి బయటకు పంపేవారన్నారు.

2002 లో జల దృశ్యంలో టీఆర్ఎస్ కార్యాలయంలోని ఫర్నీచర్ ను ఇందిరా పార్క్ వద్ద  రోడ్డుపై బాబు వేయించారన్నారు. ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తెలంగాణ ఇవ్వకూడదని టీడీపీ లేఖ ఇచ్చిందన్నారు. అనేక సందర్భాల్లో చంద్రబాబునాయుడు అడ్డుపడ్డారని చెప్పారు.  

తెలంగాణ పదాన్ని నిషేధించిన  చరిత్ర  చంద్రబాబుదన్నారు. 2009 డిసెంబర్ లో తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత చంద్రబాబునాయుడు యూ టర్న్ తీసుకొన్నారు. అప్పటి సీఎంతో కుమ్మక్కయ్యారన్నారు.


తెలుగు ప్రజల్ని కలిపే శక్తి ఒక్క టీడీపీకే ఉందని  ఏపీ సీఎంగా  చంద్రబాబునాయుడు  ప్రమాణస్వీకారోత్సవ సమయంలో మాట్లాడారన్నారు. తొలుత ముందుగా తన కోవర్టులను చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీలో చేర్పించారన్నారు. ఆ తర్వాత  చంద్రబాబునాయుడు  కాంగ్రెస్ కండువా వేసుకొని తిరుగుతున్నారన్నారు.

తెలంగాణ మనుగడను నాశనం చేయడమే ప్రజా కూటమి లక్ష్యమన్నారు.  తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా, గోదావరి‌పై ప్రాజెక్టుల అనుమతులు రాకుండా చంద్రబాబునాయుడు అడ్డుపడ్డారన్నారు. 

వచ్చిన తెలంగాణలో కూడ చంద్రబాబునాయుడు అనేక కుట్రలు చేశారని హరీష్ రావు ఆరోపించారు. పలువురు కాంగ్రెస్ నేతలు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాన్ని  హరీష్ రావు గుర్తు చేశారు.

తనది జాతీయవాదమని మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ప్రకటించి తెలంగాణ ప్రజలను అవమానపర్చారన్నారు.  తెలంగాణ ఇవ్వొదన్న జగ్గారెడ్డికి సంగారెడ్డి టికెట్టు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే ఈ ప్రాంతాన్ని  ఆంధ్రలో కలిపేయాలని  మాట్లాడిన బలరామ్ నాయక్‌ గురించి కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడేదో చెప్పాలన్నారు. 


 

 

సంబంధిత వార్తలు

బాబుకు కౌంటర్: ఏపీ రాజకీయాల్లో వేలు పెడతాం: కేటీఆర్

కేసీఆర్, కేటీఆర్‌ల బెదిరింపులకు భయపడను: చంద్రబాబు

కేటీఆర్ ను ముద్దుగా కేసీఆర్ ఎలా పిలుస్తారో తెలుసా?

తేలుస్తాం: చంద్రబాబుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఆస్తులపై సంచలనం: కేటీఆర్ అసలు పేరు చెప్పిన యాష్కీ

రేపు కవిత చిట్టా విప్పుతా: కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులపై యాష్కీ సంచలనం