Asianet News TeluguAsianet News Telugu

కేటీఆర్ ను ముద్దుగా కేసీఆర్ ఎలా పిలుస్తారో తెలుసా?

 రాజకీయాల్లో కమెడియన్లు చాలా మంది ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు

funny conversation between netizens and ktr
Author
Hyderabad, First Published Dec 2, 2018, 3:07 PM IST

హైదరాబాద్: రాజకీయాల్లో కమెడియన్లు చాలా మంది ఉన్నారని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్  అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసానికి తాను కట్టుబడి ఉన్నానని ఆయన మరోసారి ప్రకటించారు. ఎన్నికల తర్వాత రోబో 2.0 సినిమా చూస్తానని కేటీఆర్ చెప్పారు. 

ట్విట్టర్ వేదికగా పలువురు నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు.తెలంగాణ రాష్ట్రంలో దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే  అభివృద్ధి సాధిస్తోందని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో చంద్రబాబునాయుడు ప్రచారం చేయడం వల్ల ప్రయోజనం లేదని  కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హైద్రాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు గాను  మెట్రో, ఎంఎంటీస్, బీఆర్‌టీఎస్‌, ఫ్లైఓవర్లు, స్కైవేలు కూడ ఉపయోగపడతాయని కేటీఆర్ చెప్పారు.

రాజకీయ నాయకుల్లో  ప్రధానంగా ఓర్పు ఉండాల్సిన అవసరం ఉందని  ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ కు అనుకూలమైన వాతావరణం లేదని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మీరు సరైన వార్తా ఛానెల్ చూడడం లేదని కేటీఆర్ సమాధానమిచ్చారు.

నాలుగేళ్ల ట్రాక్ రికార్డు చూస్తే హైద్రాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్రా ప్రజలకు ఏం చేశామనే తెలుస్తోందని  కేటీఆర్ సమాధానమిచ్చారు.  ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ కు రేపు వస్తానని కేటీఆర్ ప్రకటించారు.ఎన్నికల నేపథ్యంలో కంగారు ఏమీ లేదని ఓ నెటిజన్ ప్రశ్నకు కేటీఆర్ సమాధానంగా చెప్పారు.

ఏపీలో కూడ మీ లాంటి నేతలు కావాలని ఓ నెటిజన్  వేసిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. మీరిచ్చిన సలహ గురించి ఆలోచిస్తామని చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయాలని నెటిజన్ ను కోరారు.

ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే రాజకీయ సన్యాసానికి కట్టుబడి ఉన్నానని కేటీఆర్ ఓ నెటిజన్ ప్రశ్నకు సమాధానం చెప్పారు. నల్గొండ జిల్లాలో ఎన్ని సీట్లు గెలుస్తారని కేటీఆర్‌ను ప్రశ్నించారు. అయితే జిల్లాలోని అన్ని సీట్లను ఎందుకు గెలుచుకొంటామన్నారు. పోలింగ్ తర్వాత రోబో 2.ఓ సినిమాను చూస్తామన్నారు. కేసీఆర్ తనను ఇంట్లో ముద్దుగా రాము అని పిలుస్తారని ఓ నెటిజన్  ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. నోట్ల రద్దు ట్రిక్ పనిచేయలేదన్నారు. 

సంబంధిత వార్తలు

తేలుస్తాం: చంద్రబాబుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఆస్తులపై సంచలనం: కేటీఆర్ అసలు పేరు చెప్పిన యాష్కీ

రేపు కవిత చిట్టా విప్పుతా: కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులపై యాష్కీ సంచలనం


 

Follow Us:
Download App:
  • android
  • ios