హైదరాబాద్: చంద్రబాబునాయుడు సంగతి తేలుస్తామని తెలంగాణ అపద్ధర్మ మంత్రి  కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కూకట్‌పల్లిలో శనివారం నాడు జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కేటీఆర్ చంద్రబాబుపై ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏపీతో తాము ఏనాడూ కూడ తాము తగాదాలు పెట్టుకోలేదని కేటీఆర్ చెప్పారు. అవసరమైతే ఆంధ్రాలో కూడ వేలు పెడతారని కేటీఆర్ చంద్రబాబునాయుడును హెచ్చరించారు. చంద్రబాబునాయుడును రాజకీయంగా అంతు చూసేందుకు ఆంధ్రాలో కూడ వేలు పెడతామని కేటీఆర్ తేల్చి చెప్పారు.

ఓడిపోతారే తెలిసీ కూడ సుహాసినికి కూకట్‌పల్లి సీటును చంద్రబాబునాయుడు కట్టబెట్టారని కేటీఆర్ అన్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడు, రాహుల్ గాంధీలు వీణ, ఫీడేలు వాయించుకొంటారని కేటీఆర్ చెప్పారు.

అమరావతి శంకుస్థాపన సందర్భంగా కేసీఆర్ వెళ్లిన సమయంలో రూ. 100 కోట్లు ప్రకటించాలని కేసీఆర్ అనుకొన్నారని కేటీఆర్ గుర్తు చేశారు. 

కానీ, మోడీ తట్టెడు మట్టి, చెంబు నీళ్లు తెస్తున్నారని తెలిసి  కేసీఆర్ కూడ మౌనంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్‌ను సరఫరా చేస్తున్న విషయాన్ని తెలుసుకొన్న  పవన్ కళ్యాణ్  స్వయంగా కేసీఆర్ ను అభినందించారన్నారు.

జగన్‌పై దాడి ఘటనను ఖండించినట్టు చెప్పారు. హరికృష్ణ మరణిస్తే  అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏపీలో లోకేష్‌కు అడ్డు లేకుండా చేసేందుకు సుహాసినిని కూకట్‌పల్లిలో పోటీకి దింపారని కేటీఆర్ ఆరోపించారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషించనున్నారని కేటీఆర్ చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ‌ ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

ఆస్తులపై సంచలనం: కేటీఆర్ అసలు పేరు చెప్పిన యాష్కీ

రేపు కవిత చిట్టా విప్పుతా: కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులపై యాష్కీ సంచలనం