హైదరాబాద్: ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే స్థానాలను బట్టి ఏపీ రాష్ట్రంలో తమ వ్యూహం ఉంటుందని తెలంగాణ అపద్ధర్మ మంత్రి కేటీఆర్ చెప్పారు. భవిష్యత్తులో ఏపీ రాష్ట్రంలో కూడ తాను పర్యటిస్తానని కేటీఆర్ ప్రకటించారు.

ఆదివారం నాడు టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదలకు ముందు కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఏపీ రాజకీయాల్లో ఖచ్చితంగా వేలు పెడతామన్నారు. ఏపీ రాష్ట్రంలో తాను పర్యటిస్తానని కేటీఆర్ ప్రకటించారు. అయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే స్థానాలను బట్టి  టీఆర్ఎస్ వ్యూహం ఉంటుందన్నారు.

 గ్రేటర్ హైదరాబాద్‌లో 17స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తోందన్నారు.బీజేపీ రెండు స్థానాలతో సరిపెట్టుకోవాల్సిందేనని చెప్పారు. నాగార్జున సాగర్‌లో జానారెడ్డి, కొడంగల్‌లో రేవంత్ రెడ్డి, మధిరలో భట్టి విక్రమార్క ఓడిపోవడం ఖాయమని కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. 

ఓటమి భయంతోనే రేవంత్ డ్రామాలు మొదలు పెట్టారన్నారు. కొడంగల్‌లో గెలవలేక ఎన్నికలు వాయిదా పడేలా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.మహిళలు, ముస్లీంలు ఒన్ సైడ్ టీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో కూడ టీఆర్ఎస్ విజయం సాధించనుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ స్థాయి లీడర్ ఎవరూ కూడ లేరన్నారు. సిరిసిల్లలో ఈ దఫా తనకు 50 వేల మెజారిటీ వస్తోందన్నారు. 


సంబంధిత వార్తలు

కేసీఆర్, కేటీఆర్‌ల బెదిరింపులకు భయపడను: చంద్రబాబు

కేటీఆర్ ను ముద్దుగా కేసీఆర్ ఎలా పిలుస్తారో తెలుసా?

తేలుస్తాం: చంద్రబాబుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఆస్తులపై సంచలనం: కేటీఆర్ అసలు పేరు చెప్పిన యాష్కీ

రేపు కవిత చిట్టా విప్పుతా: కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులపై యాష్కీ సంచలనం