క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. గురువారం నాడు ఆయన ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.  

హైదరాబాద్: Coronaపై తెలంగాణ హైకోర్డు ఆదేశాలను గౌరవిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి Harish Rao లిపారు.క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని తెలంగాణ హైకోర్టు గురువారం నాడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. Telangana High court హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామన్నారు.Omicron కట్టడికి చర్యలు తీసుకొంటున్నట్టుగా ఆయన వివరించారు.

also read:క్రిస్‌మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలి: తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

 విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి టెస్టులు చేస్తున్నామని ఆయన చెప్పారు. బూస్టర్ డోస్, చిన్న పిల్లల వ్యాక్సినేషన్ పై కేంద్రం ఇంకా స్పందించలేదని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 38కి చేరుకొన్నాయి. అయితే విదేశాల నుండి వచ్చిన వారికే ఎక్కువగా ఈ వైరస్ వ్యాప్తి చెందిందని వైద్య ఆరోగ్య శాఖాధికారులు చెబుతున్నారు.రాష్ట్రంలో కరోనా కట్టడిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర,ఢిల్లీ ప్రభుత్వాల మాదిరిగానే న్యూ ఇయర్, క్రిస్‌మస్ వేడుకలపై ఆంక్షలను పెట్టాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. జనం గుంపులుగా ఉండకుండా ప్రభుత్వం ఆదేశాలివ్వాలని కోరింది. 

ఎయిర్‌పోర్టులో ఉన్నట్టుగానే ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారికి పరీక్షలు నిర్వహించాలని కూడా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చేవారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాలకు జనం వచ్చే సమయాల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. వేడుకలు నిర్వహణ సమయంలో కూడా కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవడం లేదని కూడా ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. బహిరంగ ప్రదేశాలకు వచ్చే వారంతా మాస్క్ తప్పనిసరిగా ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఒకవేళ మాస్క్ ధరించకపోతే భారీ జరిమానాను విధించాలని కూడా ఆదేశించింది.రెండు , మూడు రోజుల్లో ఆంక్షలను అమల్లోకి తీసుకురావాలని కూడా హైకోర్టు సూచించింది. ఈ ఆదేశాలను గౌరవిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.ఈ మేరకు మంత్రిహరీష్ రావు స్పందించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి పెరిగిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 38కి చేరుకొన్నాయి. నిన్న ఒక్క రోజే 14 కేసులు నమోదయ్యాయి. ఈ 14 కేసులు కూడా విదేశాల నుండి వచ్చినవారికే ఒమిక్రాన్ సోకిందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.ఒమిక్రాన్ సోకిన రోగులకు హైద్రాబాద్ గచ్చిబౌలి టిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు.దుబాయ్ నుండి రాజన్న సిరిసిల్లకు వచ్చిన వ్యక్తికి కూడా కరోనా నిర్ధారణ అయింది. ఆయన శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపితే ఒమిక్రాన్ గా తేలింది. దీంతో గ్రామస్థులు లాక్ డౌన్ విధించుకొన్నారు. సూడాన్ నుండి హయత్ నగర్ కు వచ్చిన వ్యక్తికి కూడా ఒమిక్రాన్ సోకింది. దీంతో అతడిని టిమ్స్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.బాదితుడు 20 ఏఁళ్ల యువకుడిగా అధికారులు తెలిపారు.