క్రిస్‌మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలి: తెలంగాణ హైకోర్టు ఆదేశాలు

న్యూఇయర్, క్రిస్‌మస్ వేడుకలపై ఆంక్షలు విధించాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గురువారం నాడు కరోనాపై తెలంగాణ హైకోర్టు విచారణ నిర్వహించింది.

High Court Orders to Impose Restrictions on Christmas and New Year Celebrations in Telangana

హైదరాబాద్: న్యూఇయర్, క్రిస్‌మస్ వేడుకలపై ఆంక్షలు విధించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కరోనా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఈ ఆదేశాలు జారీ చేసింది.కరోనాపై   Telangana High Court  గురువారం నాడు విచారణ నిర్వహించింది.ఈ విచారణ సందర్భంగా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. Maharashtra,delhi ప్రభుత్వాల మాదిరిగానే New year, christmas వేడుకలపై ఆంక్షలను పెట్టాలని తెలంగాణ హైకోర్టు సూచించింది.

also read:తెలంగాణలో విస్తరిస్తోన్న ఒమిక్రాన్.. కొత్తగా 14 కేసులు, 38కి చేరిన బాధితుల సంఖ్య

 జనం గుంపులుగా ఉండకుండా ప్రభుత్వం ఆదేశాలివ్వాలని కోరింది. ఎయిర్‌పోర్టు్లో ఉన్నట్టుగానే ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వారికి  పరీక్షలు నిర్వహించాలని కూడా హైకోర్టు తెలంగాన ప్రభుత్వానికి సూచించింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చేవారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. బహిరంగ ప్రదేశాలకు జనం వచ్చే సమయాల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. వేడుకలు నిర్వహణ సమయంలో కూడా కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవడం లేదని కూడా ఈ సందర్భంగా హైకోర్టు పేర్కొంది. బహిరంగ ప్రదేశాలకు వచ్చే వారంతా మాస్క్ తప్పనిసరిగా ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఒకవేళ మాస్క్ ధరించకపోతే భారీ జరిమానాను విధించాలని కూడా ఆదేశించింది.రెండు , మూడు రోజుల్లో ఆంక్షలను అమల్లోకి తీసుకురావాలని కూడా హైకోర్టు సూచించింది. 

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి పెరిగిపోతుంది.  తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 38కి చేరుకొన్నాయి. నిన్న ఒక్క రోజే 14 కేసులు నమోదయ్యాయి. ఈ 14 కేసులు కూడా  విదేశాల  నుండి వచ్చినవారికే ఒమిక్రాన్ సోకిందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.ఒమిక్రాన్ సోకిన రోగులకు హైద్రాబాద్ గచ్చిబౌలి టిమ్స్ లో  చికిత్స అందిస్తున్నారు. దుబాయ్ నుండి రాజన్న సిరిసిల్లకు వచ్చిన వ్యక్తికి కూడా కరోనా నిర్ధారణ అయింది. ఆయన శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపితే ఒమిక్రాన్ గా తేలింది. దీంతో గ్రామస్థులు లాక్ డౌన్ విధించుకొన్నారు. సూడాన్ నుండి హయత్ నగర్ కు వచ్చిన వ్యక్తికి కూడా ఒమిక్రాన్ సోకింది. దీంతో అతడిని టిమ్స్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.బాదితుడు 20 ఏఁళ్ల యువకుడిగా అధికారులు తెలిపారు.

ఒమిక్రాన్ కేసులు నమోదైన దేశాల నుండి వచ్చిన వారిలో బుధవారం నాడు నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. వీరి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపామని అధికారులు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ సోకిన బాధితుల్లో ఒక్కువగా ఆఫ్రికా దేశాలతో పాటు గల్ఫ్ దేశాల నుండి వచ్చినవారేనని వైద్య ఆరోగ్యశాఖాధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు నమోదైన 38 కేసుల్లో ఎక్కువగా ప్రమాదం లేని దేశాల నుండి ( ఎట్ రిస్క్ లేని దేశాలు) వచ్చినవారేనని వైద్య శాఖాధికారులు తెలిపారు. ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ కు ఆప్రికా నుండి వచ్చిన రోగికి ఒమిక్రాన్ వైరస్ సోకిందని వైద్యులు గుర్తించారు.ఒమిక్రాన్ సోకిన 11మంది రోగులు టిమ్స్ లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios