Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌ పార్టీకి అందుకోసమే అల్టిమేటం జారీ చేశాం: కోదండరాం

గత నాలుగున్నరేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా సాగిన నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడినట్లు టీజెఎస్ అధినేత కోదండరాం తెలిపారు. ప్రతిపక్షాలన్ని కలిసి ఏర్పడిని ఈ మహాకూటమి టీఆర్ఎస్ పార్టీని గద్దెదించడం ఖాయమని అన్నారు.  
 

telangana jana samithi president kodandaram talks about mahakutami
Author
Manchiryal, First Published Oct 15, 2018, 8:19 PM IST

గత నాలుగున్నరేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా సాగిన నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పడినట్లు టీజెఎస్ అధినేత కోదండరాం తెలిపారు. ప్రతిపక్షాలన్ని కలిసి ఏర్పడిని ఈ మహాకూటమి టీఆర్ఎస్ పార్టీని గద్దెదించడం ఖాయమని అన్నారు.  

మంచిర్యాలలో జరిగిన ఓ కార్యక్రమంలో కోదండరాం టీజెఎస్ కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మహాకూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో తాను కాంగ్రెస్ కు అల్టిమేటం జారీ చేయడానికి గల కారణాలను వివరించారు. మహాకేటమిలోని పార్టీల మధ్య పొత్తుల విషయంలో  ఆలస్యం జరిగే కొద్దీ గందరగోళం తలెత్తుతోందన్నారు. దీంతో నిరంకుశ శక్తులకు లాభం జరిగే ప్రమాదమున్నందున త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని తాను డిమాండ్ చేసినట్లు కోదండరాం వివరించారు.

కూటమిలోని మిత్ర పక్షాలకు సీట్లు కేటాయించే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ సపార్టీయే అని ఆయన స్పష్టం చేశారు. అయితే తెలంగాణ జనసమితి మాత్రం గెలిచే స్థానాలనే కేటాయించాలని కోరుతున్నట్లు తెలిపారు.  

తెలంగాణ ఉద్యమ ఆంకాంక్షను నేరవేర్చకుండా ఈ నాలుగేళ్ల పాలన కొనసాగినట్లు కోదండరాం ఆరోపించారు. అందువల్లే ఆ లక్ష్యం నెరవేరడానికి అన్ని పార్టీలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. 


సంబంధిత వార్తలు

కేసీఆర్ కు పాలించడం చేతకాక నాలుగున్నరేళ్లకే దిగిపోతానంటున్నారు : కోదండరాం

తెలంగాణ భవన్ కిరాయికి ఇవ్వాలి : కోదండరాం చురకలు

కోదండరాం జన సమితికి బిసి దెబ్బ (వీడియో)

 

Follow Us:
Download App:
  • android
  • ios