Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కు పాలించడం చేతకాక నాలుగున్నరేళ్లకే దిగిపోతానంటున్నారు : కోదండరాం

కౌలు రైతుల కోసం పోరాటానికి సిద్దమన్న కోదండరాం...

tjs chief kodandaram fires on kcr

సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల ప్రకటన పై తెలంగాణ ప్రజా సమితి పార్టీ అద్యక్షుడు కోదండరాం ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంగా రాష్ట్రాన్ని పాలించడం చేతగాకే ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ లో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ టిజెఎస్ మాత్రమేనని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ అభ్యర్థులను గెలుపించుకుని అధికారాన్ని చేజిక్కించుకుంటామని కొదండరాం ధీమా వ్యక్తం చేశారు.

ఇక రైతు బంధు పథకం లో కౌలు రైతులను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. కౌలు రైతుల మీద మొదటి నుండి ఈ ప్రభుత్వం విషం కక్కుతూనే ఉందని అన్నారు. వారేమైనా భూ యాజమాన్య హక్కులు అడుగుతున్నారా అని కోదండరాం ప్రశ్నించారు. తమ పార్టీ చిన్న,సన్నకారు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా అండగా ఉంటామని కోదండరాం స్పష్టం చేశారు. 

తెలంగాణ  ప్రభుత్వం అందరి రైతుల మాదిరిగానే కౌలు రైతులకు కూడా రైతు బంధు పథకానికి అర్హులుగా గుర్తించాలని సూచించారు. వారికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం తో  తెలంగాణ ప్రజా సమితి పార్టీ తరపున పోరాడతామని కోదండరాం స్పష్టం చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios