తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతున్నాయి. మెకద్ జిల్లా చిన్నశంకరం పేట మండలం మడూర్ గ్రామానికి చెందిన చాకలి రాజు అనే 18 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థా

నిక ప్రభుత్వం జూనియర్ కాలేజీలో సీఈసీ రెండో సంవత్సరం చదువుతున్న రాజు... ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో రెండు సబ్జెక్టుట్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను గ్రామంలోని పాఠశాలలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిరుమలాపూర్‌కు చెందిన జ్యోతి అనే విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ సెకండియర్ చదువుతున్న జ్యోతి... సివిక్స్ పరీక్షలో ఫెయిల్ అయ్యింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన జ్యోతి ఒంటికి నిప్పటించుకుంది.

వెంటనే గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూసింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడకు చెందిన నవీన్ ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో మంగళవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

మరోవైపు ఇంటర్ బోర్డు అవకతవకలపై విద్యార్ధి సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. బేగంపేటలో ఉన్న ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ముట్టడికి ఎస్ఎఫ్ఐ ప్రయత్నించింది.

విద్యార్ధి సంఘం నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డ్ కార్యాలయం వద్ద వరుసగా నాలుగో రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. బోర్డు వైఫల్యాలపై తల్లిదండ్రులతో పాటు విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ఉద్యోగులు సైతం రావాల్సిన సమయం కంటే ముందుగానే విధులకు హాజరవుతున్నారు. మరో వైపు పరీక్షా పత్రాల రీ వాల్యుయేషన్, మార్కుల రీకౌంటింగ్ గడువు పెంచినప్పటికీ... ఇంటర్ బోర్డ్ ఓపెన్ కాకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.

దీంతో వారు తల్లిదండ్రులతో కలిసి పెద్ద సంఖ్యలో ఇంటర్ బోర్డ్ వద్దకు క్యూకడుతున్నారు. ఇంత జరుగుతున్నా బోర్డు అధికారులు తమ తప్పులు కప్పిపుచ్చుకుంటున్నారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్ధులు, తల్లిదండ్రులపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు.

మరోవైపు ఇంటర్ పరీక్షలో నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ గురువారం కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చింది. 

తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య... రైలుకిందపడి దారుణం

ఇంటర్‌బోర్డు చెలగాటం: విద్యార్ధుల ఆత్మహత్యలతో ‘‘తెలంగాణ తల్లి’’ గుండెకోత

మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

తెలంగాణ ఇంటర్ ఫెయిల్: సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య (వీడియో)

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘాల ఆందోళన