హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలని పదేపదే హెచ్చరించిన హైకోర్టు శుక్రవారం మాత్రం టైంఫిక్స్ చేసి చర్చలకు పిలవాలని మరీ ఆర్డర్ వేసింది. 

శనివారం ఉదయం 10.30 గంటలకు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. అయితే చర్చలపై తమకు ఎలాంటి ప్రమేయం లేదని అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు. 

ఆర్టీసీ కార్మికుల సమస్యలప పరిష్కారానికి సంబంధించి చర్చలు జరుపుతుండగానే యూనియన్ సంఘాలు సమ్మెకు వెళ్లాయని అడ్వకేట్ జనరల్ హైకోర్టు విన్నవించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని కూడా చెప్పుకొచ్చారు. అయితే తమ ప్రమేయం ఏమీలేదంటూ చెప్పుకొచ్చారు. 

అడ్వకేట్ జనరల్ వ్యాఖ్యలపై కూడా హైకోర్టు స్పందించింది. యూనియన్ నేతలతో చర్చలు జరపాలని కార్పొరేషన్ ను ఆదేశిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి మరికాసేపట్లో ఉత్తర్వులను సైతం వెల్లడించనుంది హైకోర్టు. 

మరోవైపు ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ తరపు న్యాయవాది ప్రకటించారు. ప్రభుత్వం చర్చలు జరిపితే తాము వెళ్లేందుకు సుముఖంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. 

ఇదే విషయాన్ని గత కొద్దిరోజులుగా ప్రభుత్వానికి సైతం తెలియజేసినట్లు తెలిపారు. మూడు రోజుల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని హైకోర్టు కేసీఆర్ ప్రభుత్వానికి గట్టిగా చెప్పింది. 

ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే పట్టించుకోరా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. 50 శాతం డిమాండ్లతో కార్మికులు చేస్తున్న సమ్మె సబబేనంటూ హైకోర్టు స్పష్టం చేసింది.  

ప్రస్తుతం నెలకొన్న సమస్య ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మికుల మధ్య ఉన్నది కాదని అది ప్రజల సమస్య అని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ సమస్యల ఇలాగే ఉంటే ప్రజలు తిరగబడే ప్రమాదం ఉందని అప్పుడు ఎవరూ ఆపలేరని హైకోర్టు స్పష్టం చేసింది.

ఇకపోతే ఆర్టీసీ తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 5 నుంచి సమ్మెకు వెళ్లింది. ఆనాటి నుంచి సమ్మె నిర్విరామంగా కొనసాగుతుంది. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ కార్మికుల తలపెట్టిన సమ్మెకు అధికార టీఆర్ఎస్ పార్టీ మినహా అన్ని పార్టీలు తమ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసందే. 

అంతేకాకుండా తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఈనెల 19 వరకు ఆందోళన ప్రకటించింది. ఈనెల 19న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది. తెలంగాణ బంద్ కు టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఉద్యోగ సంఘాలు, ఓలా, ఊబర్ క్యాబ్ ల డ్రైవర్లు సైతం సంఘీభావం ప్రకటించాయి. 

 

ఈ వార్తలు కూడా చదవండి

ప్రజలు తిరగడితే ఎవరూ ఏం చేయలేరు: కేసీఆర్‌ సర్కార‌్‌కు హైకోర్టు హెచ్చరిక

ఆర్టీసీ నష్టాలపై మహిళా కండక్టర్ ను పంపిస్తా, చర్చకు సిద్ధమా: కేసీఆర్ కు అశ్వత్థామరెడ్డి సవాల్

కేసీఆర్ సెల్ఫ్ గోల్, గులాబీ ఓనర్లు గప్ చుప్: అశ్వత్థామ రెడ్డి వెనక

ఒకదానిపై మరొకటి: కేసీఆర్ పై తమిళిసై మరో అస్త్రం