హైదరాబాద్:   ప్రజలు తిరగబడితే ఎవరూ కూడ ఆపలేరని తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. 

శుక్రవారం నాడు మధ్యాహ్నం ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపిందింది.ఈ విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు  చేసింది.ఆర్టీసీ సమ్మెపై విచారణ ప్రారంభించగానే ఆర్టీీసీకి పూర్తిస్థాయి  ఎండీని నియమించారా అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఈ విషయమై ప్రభుత్వం తరపు న్యాయవాది మాత్రం పూర్తిస్థాయి  ఎండీ నియామకం అవసరం లేదని హైకోర్టుకు తేల్చి చెప్పారు.

సునీల్ శర్మ భేటీ: RTC కార్మికుల సమ్మెపై తమిళిసై రియాక్షన్ ఇదీ

రవాణా శాఖ కార్యదర్శి చాలా సమర్థవంతమైన అధికారి అని హైకోర్టుకు ప్రభుత్వ తరపు న్యాయవాది వివరించారు. కొత్తగా ఎండీని నియమించడం వల్ల కూడ సమస్య పరిష్కారం కూడ కాదని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు వివరించారు.

రెండు వారాలుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నా కూడ ఎందుకు పట్టించుకోవడం లేదని కూడ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం  ఎందుకు ఆపలేకపోతోందని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తివంతులని హైకోర్టు అభిప్రాయపడింది.

RTC Strike: రంగంలోకి దిగిన గవర్నర్ తమిళిసై, కేసీఆర్‌కు చిక్కులు

ప్రజలు తిరగబడితే ఎవరూ కూడ ఏమీ చేయలేరని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తివంతులనే విషయాన్ని మర్చిపోకూడదని హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. గతంలో ఫిలిప్పిన్స్ లో చోటు చేసుకొన్న ఆందోళనను హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రజలు ఏ రకంగా తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం చేశారో హైకోర్టు గుర్తు చేసింది.

ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోలేదా: కేసీఆర్‌పై ఆర్టీసీ నేత అశ్వత్థామరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మరికొందరు మద్దతు ప్రకటిస్తే ఇక ఆందోళనలను ఎవరూ కూడ ఆపలేరని  హైకోర్టు అభిప్రాయపడింది.ఆర్టీసీ సమ్మె విషయమై  హైకోర్టు చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా హెచ్చరికలాంటివని విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ నెల5 వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ తో పాటు 26 డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

ఆర్టీసీ కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆర్టీసీ జేఎసీ నేతలు అన్ని పార్టీలను కలుపుకొని రాజకీయంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ నెల 19న తెలంగాణ రాష్ట్ర బంద్ కు ఆర్టీసీ జేఎసీ పిలుపునిచ్చింది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీలు కూడ ఈ బంద్ కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. 

rtc strike: కేసీఆర్ ప్రభుత్వంపై ఆశ్వాత్థామ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వాన్ని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆరా తీశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో గవర్నర్ గురువారం నాడు ఫోన్ చేసి మాట్లాడారు. రవాణా శాఖ  కార్యదర్శి సునీల్ శర్మ గురువారం నాడు గవర్నర్ తో భేటీ అయి ప్రభుత్వం ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రభుత్వం తీసుకొన్న చర్యలను వివరించారు.

ఈ నెల 19న తలపెట్టిన బంద్ ను జయప్రదం చేయాలని కోరుతూ శుక్రవారం నాడు సుందరబయ్య కేంద్రంలో అన్ని పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి.బంద్ ను విజయవంతం చేయాలని అన్ని పార్టీలు ప్రజలను కోరారు.