గంగిరెడ్డి బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అసాధారణం - సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన టి.గంగిరెడ్డి బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అసాధారణం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బెయిల్ రద్దు చేస్తునే మళ్లీ బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు ఇవ్వాడాన్ని ప్రశ్నించింది. 

Telangana High Court's verdict on Gangireddy's bail is extraordinary - Supreme Court's key comments..ISR

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైన టి.గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేస్తూ, అదే క్రమంలో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అసాధారణ ఉత్తర్వులను సుప్రీంకోర్టు బుధవారం ప్రశ్నించింది. హత్య కేసులో నిందితుడికి బెయిల్ రద్దు చేసిన తరువాత, మళ్లీ  నిందితులను బెయిల్ పై విడుదల చేయాలని కోర్టు ఎలా ఆదేశాలు ఇస్తుందని ప్రశ్నించింది.

నేడే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే ? 

‘‘హైకోర్టు బెయిల్ రద్దు చేసింది. నిందితులు రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ బెయిల్ రద్దు చేసిన తర్వాత చివరి భాగాన్ని ఎలా జారీ చేస్తారు’’ అని తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 27 నాటి ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలిస్తూ జస్టిస్ పీఎస్ నరసింహ, పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

అయితే సునీత విజ్ఞప్తిని సీబీఐ సమర్ధించింది. ఈ సందర్భంగా సీబీఐ తరుఫు న్యాయవాది ఏఎస్‌జీ సంజయ్ జైన్ మాట్లాడుతూ.. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఈ బెయిల్ ఉత్తర్వులు న్యాయశాస్త్రంలో 8వ అద్భుతమని అన్నారు. “ఈ రకమైన ఆర్డర్ బెయిల్ న్యాయశాస్త్రంలో 8వ అద్భుతం. ఇలాంటిది మేము ఎప్పుడూ వినలేదు. బెయిల్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి, మళ్లీ బెయిల్‌ను అనుమతించింది. ఇది అంతర్గతంగా విరుద్ధమైనది. మొత్తం వ్యవస్థను నాశనం చేస్తుంది.’’ అని అన్నారు.

అమెరికాలో మహబూబ్‌నగర్‌ యువకుడు మృతి.. ఏమైందంటే ?

గంగిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది దాననాయుడు మాట్లాడుతూ.. గంగిరెడ్డి 100 సార్లు సీబీఐ ఎదుట హాజరైనట్లు కోర్టుకు తెలిపారు. సీబీఐ దర్యాప్తు చేపట్టిన తర్వాత ఆయన డిఫాల్ట్ బెయిల్ పొందాడని చెప్పారు. కడప జిల్లా పులివెందుల కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా గంగిరెడ్డి సవాల్ చేశారని కోర్టుకు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ధర్మాసనం రెండు పిటిషన్లను (సునీతా నర్రెడ్డి, గంగిరెడ్డి) శుక్రవారం లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ‘‘ఈ ఉత్తర్వు కరెక్టును ఆయన సవాలు చేస్తే మేం వినాల్సి ఉంటుంది. మరుసటి రోజు విచారణ చేపడతాం’’ అని జస్టిస్ పీఎస్ నరసింహ తెలిపారు. 

కాగా.. వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ ఎదుట మే 5లోగా లొంగిపోవాలని ఏప్రిల్ 27న బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు గంగిరెడ్డిని ఆదేశిస్తూ.. ఆయన లొంగిపోయిన తరువాత జూన్ 30 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తామని పేర్కొంది. అలాగే జూలై 1న ఆయనను విడుదల చేయాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. రూ.1.5 లక్షలకు పూచీకత్తు సమర్పిస్తే ట్రయల్ కోర్టు నుంచి బెయిల్ పొందవచ్చని తెలంగాణ హైకోర్టు పేర్కొంది.

పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై వివాదం.. కాంగ్రెస్ లాజిక్ వెనక అసలు విషయం ఏమిటి?

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గత వారం ఈ పిటిషన్ లో నోటీసులు జారీ చేస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బెయిల్ రద్దు చేసేటప్పుడు హైకోర్టు తాను బెయిల్ రద్దు చేస్తున్నానని చెబుతోందని, అయితే 30న విడుదల అవుతారని కూడా పేర్కొందని అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios