పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై వివాదం.. కాంగ్రెస్ లాజిక్ వెనక అసలు విషయం ఏమిటి?

మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జాతికి అంకితం చేయనున్నారు. అయితే పార్లమెంట్‌ నూతన భవనాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించడాన్ని కాంగ్రెస్‌తో పాటు పలు విపక్షాలు రాద్దాంతం చేస్తున్న సంగతి తెలిసిందే.

What is the real issue behind New Parliament Building inauguration controversy ksm

న్యూఢిల్లీ: పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం వేళ విపక్షాలు రాద్దాంతం చేస్తున్న సంగతి తెలిసిందే. మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జాతికి అంకితం చేయనున్నారు. అయితే పార్లమెంట్‌ నూతన భవనాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించడాన్ని కాంగ్రెస్‌తో పాటు పలు విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాము  ఈ కార్యక్రమానికి దూరంగా ఉండనున్నట్టుగా ప్రకటించాయి. ఇందులో కాంగ్రెస్ ముందంజలో ఉంది. దీంతో చాలా మంది కాంగ్రెస్ వ్యతిరేకతకు కారణాన్ని వెతకడం మొదలుపెట్టారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు పలు విమర్శలు తావిచ్చేలా ఉందని అంటున్నారు. ఇందుకు గతంలో జరిగిన పలు ఘటనలను గుర్తుచేస్తున్నారు. 

1927లో మోతీలాల్ నెహ్రూ ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రస్తుత పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ భవనాన్ని అప్పటి బ్రిటిష్ వలసవాదుల వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అనేక వాదనలు చేసి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు. వలసవాద ఆక్రమణను కొనసాగించే ఏ కార్యక్రమానికి తాము హాజరు కాబోమని వారు చెప్పలేదు. 

మరోవైపు ప్రస్తుతం వారు చెబుతున్న లాజిక్ ప్రకారం.. అప్పటి పార్లమెంటరీ వ్యవస్థకు బ్రిటిష్ రాజు నిజమైన రాజ్యాంగ అధిపతి, వైస్రాయ్ కాదని కాంగ్రెస్ కూడా చెప్పవచ్చు. ఇంతకీ వైస్రాయ్ పార్లమెంటు భవనాన్ని ఎందుకు ప్రారంభిస్తున్నారు? బదులుగా బ్రిటిష్ రాజు ప్రారంభించాలి..  అప్పుడు మాత్రమే తాము హాజరవుతామని కాంగ్రెస్ అసంబద్ధ వాదనలేమీ చేయలేదు. అయితే.. అలాంటి అసంబద్ధత ప్రధాని మోదీకి మాత్రమే ఎందుకనే ప్రశ్నలు తలెత్తున్నాయి. 

కాంగ్రెస్ దృష్టిలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రి బ్రిటీష్ ఏజెంట్ కంటే తక్కువా? అని పులువురు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ చెబుతున్నది అసలు కారణం కాదని.. ఇందుకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఒకటి ప్రధాని మోదీపై ఎనలేని ద్వేషం.. మరొకటి భారతదేశం గాంధీ కుటుంబానికి చెందిన ఆస్తి అని, ఎవరైనా జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఏ కార్యకలాపాన్ని ఎలా చేపట్టగలరనే హక్కు భావం అని పేర్కొంటున్నారు.

ఈ క్రమంలోనే గతంలో ఏ లాజిక్‌తో కాంగ్రెస్ పలు చర్యలు చేపట్టిందని ప్రశ్నిస్తున్నారు. 2017లో జీఎస్టీని తీసుకురావడానికి కాంగ్రెస్ అర్ధరాత్రి సమావేశాన్ని ఎందుకు బహిష్కరించింది?, అప్పుడు రాష్ట్రపతి, ప్రధాని ఇద్దరూ హాజరయ్యారు కదా.. కాంగ్రెస్ పార్టీ అప్పటి లాజిక్ ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అసెంబ్లీకి సోనియా గాంధీ పునాది వేయడాన్ని ఏ లాజిక్ సమర్ధిస్తుందని కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ ఇప్పుడు చెబుతున్న లాజిక్ ప్రకారం చూస్తే.. అది ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అయి ఉండాలి (రాష్ట్రాలలో రాష్ట్రపతికి సమానం). అయితే గవర్నర్‌ను పక్కనపెడితే.. ఎన్నికైన ముఖ్యమంత్రి అయినా చేపట్టాల్సి ఉంది. అయితే సోనియాగాంధీ ఏ రాజ్యాంగ హోదా లేకుండా అసెంబ్లీ భవనానికి పునాది వేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

కాంగ్రెస్‌లో ప్రతి చర్య గాంధీ కుటుంబం చుట్టూనే తిరుగుతుందని అనడానికి అనేక ఊదాహరణలు ఉన్నాయని చెబుతున్నారు. వీటన్నింటిని పరిశీలిస్తే.. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం వెనుక ఉన్న సమస్య రాష్ట్రపతి ప్రారంభించలా? వద్దా? అనేది కాదు. ప్రధాని మోదీ పట్ల ద్వేషం, గాంధీ కుటుంబానికి అర్హత అనే రెండు భావాలు కనిపిస్తున్నాయి. 

నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం వేళ ఈ చర్చ జరగడం ఒక విధంగా మంచిదేనని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో కాంగ్రెస్ ఏం చేసిందో ప్రజలు తెలుస్తుందని పేర్కొంటున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios