నేడే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు నేడు ఉదయం 9.30 గంటలకు విడుదల కానున్నాయి. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రెస్ మీట్ లో వీటిని విడుదల చేయనున్నారు. మే 12వ తేదీ నుంచి 14 వరకు ఈ పరీక్షలు జరిగాయి.
తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ఎంసెట్ - 2023 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. వీటిని మొదట ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించినా పలు కారణాల వల్ల కొంచెం ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించారు. తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి ఉదయం 9.30 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నారు. టీఎస్ ఎంసెట్ - 2023 పరీక్షలు మే 12 నుంచి 14 వరకు జరిగాయి. అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలకు సంబంధించిన ఎంసెట్ ఆన్సర్ కీని మే 14న, ఇంజినీరింగ్ పరీక్షకు మే 15న విడుదల చేశారు.
అమెరికాలో మహబూబ్‌నగర్ యువకుడు మృతి.. ఏమైందంటే ?
ఫలితాలు చెక్ చేసుకునే విధానం..
- ఈ పరీక్ష ఫలితాలను చెక్ చేసుకోవడానికి విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, అర్హత పరీక్ష హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీతో సిద్ధంగా ఉండాలి.
- టీఎస్ ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ eamcet.tsche.ac.in లోకి వెళ్లాలి.
- హోమ్ పేజీలో టీఎస్ ఎంసెట్ 2023 రిజల్ట్ లింక్ పై క్లిక్ చేయాలి.
- తదుపరి దశలో విద్యార్థులు లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
- వివరాలు సమర్పించిన తర్వాత టీఎస్ ఎంసెట్ 2023 ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. దానిని ఒక సారి చెక్ చేసుకోని డౌన్ లోడ్ చేసుకోవాలి.
పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై వివాదం.. కాంగ్రెస్ లాజిక్ వెనక అసలు విషయం ఏమిటి?
టీఎస్ ఎంసెట్ 2023 పరీక్షలో అభ్యర్థుల స్కోరు ఆధారంగా మూడు రౌండ్లలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. టీఎస్ ఎంసెట్ 2023 ర్యాంకు కార్డు, హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఇంటర్మీడియట్ మెమో కమ్ పాస్ సర్టిఫికెట్ వంటి పలు సర్టిఫికెట్లు కౌన్సెలింగ్ కోసం అవసరమవుతాయి. వీటిని విద్యార్థులు అందుబాటులో ఉంచుకోవాలి. టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కటాఫ్ లను టీఎస్ సీహెచ్ విడుదల చేస్తుంది. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శిస్తూ ఉండాలి.