Asianet News TeluguAsianet News Telugu

విరమించాలని చెప్పలేం, పరిమితులుంటాయి: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు

ఆర్టీసీ కార్మికులను సమ్మె విరమించాలని తాము చెప్పలేమని, తమకు కొన్ని పరిమితులు ఉంటాయని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది.ఆర్టీసీ సమ్మెపై విచారణను రేపటికి వాయిదా వేసింది.

Telangana High court interesting comments on Rtc Strike
Author
Hyderabad, First Published Nov 11, 2019, 5:58 PM IST

అమరావతి:ఆర్టీసీ కార్మికులను సమ్మె విరమించాలని తాము చెప్పలేమని, తమకు కొన్ని పరిమితులు ఉంటాయని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది.ఆర్టీసీ సమ్మెపై విచారణను రేపటికి వాయిదా వేసింది.

Also read:మా పరిధిలో ఉందా, లేదా చూస్తాం: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు

ఆర్టీసీ సమ్మెతో పాటు ఆర్టీసీ ప్రైవేటీకరణపై దాఖలైన రెండు పిటిషన్లను సోమవారం మధ్యాహ్నం హైకోర్టు విచారించింది. ఈ విచారణ సమయంలో ఆర్టీసీ సమ్మె విషయమై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట విరుద్దమైందని, సమ్మెను విరమింజేయాలని ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ వాదించారు. అయితే ఈ వాదనను ఆర్టీసీ తరపు న్యాయవాది తోసిపుచ్చారు.

Also read:ఆర్టీసీ నష్టాలు రూ.5269 కోట్లు: అఫిడవిట్‌లో వివరాలివీ...

తమకు కూడ కొన్ని పరిమితులు ఉంటాయని హైకోర్టు అభిప్రాయపడింది. ఇలా చేయాలని ఎవరిని కూడ తాము ఆదేశించలేమని కోర్టు తేల్చి చెప్పింది. పరిమితికి మించి ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది.

ఆర్టీసీకి ఈ ఏడాది ఆగస్టు నాటికి సుమారు రూ. 5వేలకు పైగా బకాయిలు అప్పులు ఉన్నాయని, రూ. 47 కోట్లను చెల్లిస్తే ఆర్టీసీని నష్టాల ఊబిలో నుండి బయటపడేయలేమని  ప్రభుత్వం అభిప్రాయపడింది.ఇదే విషయాన్ని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రభుత్వం ప్రకటించింది.

Also Read:యూనియన్లతో ఇక చర్చల్లేవ్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టుకు చెప్పనున్న కేసీఆర్ సర్కార్

ఆర్టీసీ సమ్మె విషయమై మెట్టు దిగాలని  ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యానికి తాము చెప్పిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. కార్మికులతో చర్చలు జరపాలని తాము కోరినట్టుగా  హైకోర్టు గుర్తు చేసింది.

Also read:ఈ నెల 12న నిరవధిక దీక్షకు దిగుతున్నాం: ఆశ్వత్థామరెడ్డి

అయితే ఆర్టీసీ సమ్మెపై విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.మంగళవారంనాడు హైకోర్టు సమ్మె విషయమై ఏ రకమైన తీర్పును చెబుతోందోననేది ప్రస్తుతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు అక్టోబర్ 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎంలు తమ మద్దతును ప్రకటించాయి. ఆర్టీసీ జేఎసీ ఈ నెల 18వ తేదీ వరకు తమ నిరసన కార్యక్రమాలను ప్రకటించింది.

ఈ నెల 18వ తేదీన జేఎసీ నేతు సడక్ బంద్ నిర్వహించనున్నారు. ఈ నెల 12వ తేదీన జేఎసీకి చెందిన నలుగురు కీలక నేతలు నిరవధిక దీక్షకు దిగనున్నారు. ఆర్టీసీ కార్మికులు 

Follow Us:
Download App:
  • android
  • ios