తెలంగాణ ప్రభుత్వం గురువారం లోకాయుక్తను, ఉప లోకాయుక్తను నియమించింది. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని కమిటీ ప్రగతి భవన్‌లో సమావేశమై లోకాయుక్త, ఉప లోకాయుక్త పేర్లను నిర్ణయించింది.

ఈ కమిటీలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ, మండలీలో విపక్ష నాయకులు పాషా ఖాద్రీ, జాఫ్రీ ఉన్నారు. కమిటీ చేసిన సిఫారసులను గవర్నర్ తిమిళిసై ఆమోదించారు.

ఈ సందర్భంగా లోకాయుక్తగా జస్టిస్ సివి.రాములు, ఉప లోకాయుక్తగా జి.నిరంజన్ రావును సిఫారసు చేసింది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమీషన్‌ను ప్రభుత్వం నియమించింది. ఛైర్మన్ గా బి. చంద్రయ్య, సభ్యులుగా  ఎన్. ఆనందరావు, మొహమద్ ఇర్ఫాన్ మోయినుద్దీన్ లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

Also Read:

దిశ కేసు: రూ. 50 లక్షలు కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన నిందితుల కుటుంబాలు

హాజీపూర్ కేసు: జడ్జి ప్రశ్నలకు నోరు మెదపని శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణను తాకిన రాజధాని సెగ: ఆదిలాబాద్‌లో అసెంబ్లీ సమావేశాలకు డిమాండ్