Asianet News TeluguAsianet News Telugu

ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ స‌ర్కార్ సీరియస్

ఇబ్రహీంపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ లో వెలుగులోకి వచ్చిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనను తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బాధ్యులపై చర్యలకు ఉపక్రమించింది. 

Telangana government is serious about Ibrahimpatnam family planning operation incident
Author
First Published Sep 24, 2022, 9:32 AM IST

పోయిన నెల 25వ తేదీన ఇబ్రహీంపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ లో చోటు చేసుకున్న కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ ఘ‌ట‌న‌పై వ‌చ్చిన నివేదిక ఆధార‌ణంగా చ‌ర్య‌లు తీసుకుంది. రంగారెడ్డి డీఎంహెచ్ వో, డీసీహెచ్ ఎస్ ను ట్రాన్స్ ఫ‌ర్ చేసింది. వీరితో పాటు 13 మంది హెల్త్ సిబ్బందిపై చ‌ర్య‌లు తీసుకుంది. 

ఇబ్ర‌హీంప‌ట్నం హాస్పిట‌ల్ డీపీఎల్ క్యాంపు ఆఫీసర్ నాగజ్యోతి, డిప్యూటీ సివిల్ సర్జన్ గీత, హెడ్ నర్స్ చంద్రకళ, అలాగే మాడుగుల్ ప్రైమెరీ హెల్త్ సెంట‌ర్ డాక్ట‌ర్ శ్రీనివాస్, సూపర్ వైజర్లు అలివేలు, మంగమ్మ, మంచాల్ ప్రైమెరీ హెల్త్ సెంట‌ర్ డాక్ట‌ర్ కిర‌ణ్, మిగితా సిబ్బంది జయలత, పూనం, జానకమ్మల ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది.

కీచక ఉపాధ్యాయుడు.. పరీక్షలో ఫెయిల్ చేస్తానని విద్యార్థినిని బెదిరించి, పలుమార్లు అత్యాచారం, గర్భం దాల్చడంతో...

కాగా ఇబ్ర‌హీంపట్నం హాస్పిట‌ల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ పై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆప‌రేష‌న్లు చేసిన డాక్ట‌ర్ సునీల్ కుమార్ పై కేసు పెట్టాల‌ని ఆదేశించింది. అయితే ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఇలాంటి ఆప‌రేష‌న్ల స‌మ‌యంలో తీసుకోవాల్సిన మార్గ‌ద‌ర్శ‌క‌ల‌ను విడుద‌ల చేసింది. అన్ని హాస్పిట‌ల్స్ వీటిని త‌ప్ప‌కుండా పాటించాల‌ని చెప్పింది. 

ఇవే ఆ మార్గ‌ద‌ర్శ‌కాలు. 
హాస్పిట‌ల్ స‌ర్వీసుల్లో భాగంగానే ఇలాంటి ఆప‌రేష‌న్లు నిర్వ‌హించాల‌ని మార్గ‌ద‌ర్శ‌కాల్లో పేర్కొంది. కుటుంబ నియంత్రణ ఆప‌రేష‌న్లు చేసిన త‌రువాత తప్ప‌కుండా ఒక రోజు అబ్జర్వేషన్ లో ఉంచాలి. హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయిన పేషెంట్ హెల్త్ కండీష‌న్ ను ఆ హాస్పిట‌ల్ సూపర్ వైజర్ 24 గంటల్లోగా ఒకసారి, వారంలో రెండు సార్లు త‌ప్పనిస‌రిగా తెలుసుకోవాలి. మెడిక‌ల్ ఆఫీస‌ర్ కూడా పేషెంట్ల‌ను రెండు రోజుల్లోగా వెళ్లి చూడాలి. పేషెంట్ కు అన్ని ర‌కాల సౌక‌ర్యాలు అందుతున్నాయో లేదో పరిశీలించాలి. 

విషాదం.. మలక్ పేట హిట్ అండ్ రన్ కేసు.. డాక్టర్ శ్రావణి కన్నుమూత..

ఆపరేషన్ల తర్వాత వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను గుర్తించేలా సూపర్ వైజర్లకు ట్రైనింగ్ క్లాసులు నిర్వ‌హిస్తూ ఉండాలి. సంవ‌త్సరానికి ఒక సారి స‌ర్జ‌న్ల నైపుణ్యాన్ని అంచనా వేసేందుకు ఓ స్పెషల్ వ్య‌వ‌స్థ‌ను రూపొందించాలి. ఒక రోజులో, ఒక హాస్పిట‌ల్ లో 30కి మించి స‌ర్జ‌రీలు చేయ‌కూడ‌దు. ఆయా హాస్పిట‌ల్స్ లో సూపరింటెండెంట్లు ప్ర‌తీ సోమ‌వారం ఇన్ఫెక్షన్ నివారించేందుకు, నియంత్రించేందుకు రివ్యూ నిర్వ‌హించాల్సి ఉంటుంది. 

ఈ ఆపరేష‌న్లలో భాగ‌స్వాములు అయ్యే సిబ్బందికి ఎప్ప‌టికప్పుడు వ‌చ్చే కొత్త ప‌ద్ద‌తుల‌పై నిమ్స్ లో ట్రైనింగ్ ఇవ్వాలి. ఇన్ఫెక్షన్ ను నివారించేందుకు పాటించాల్సిన ప‌ద్ద‌తుల‌ను సిబ్బంది పాటించేలా డీఎంఈ, టీవీవీపీ క‌మిష‌న‌ర్ లు చూసుకుంటూ ఉండాలి. మెయిన్ గా హాస్పిట‌ల్స్ లో ఉన్న ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల్లో స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios