హైదరాబాద్: లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి జేపీకి ఏం తెలుసునని ప్రశ్నించారు.  తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తి జేపీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మంగళవారం ధర్మపురి క్షేత్రాన్ని దర్శించుకున్న అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జేపీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి జేపీకీ ఏమైనా తెలుసా అంటూ ప్రశ్నించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టును విమర్శిస్తున్న నాయకులు ఎప్పుడైనా మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారా అంటూ మండిపడ్డారు. తెలంగాణపై ఈర్శ్యతోనే జేపీ అలా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ప్రాజెక్టు గురించి జేపీకి ఏమి తెలుసునంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజకీయ లబ్ధికోసమే కొన్ని రాజకీయ పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించాయని అది నెరవేరకపోవడంతో ఇప్పుడు కరెంట్ బిల్లుపై రాద్ధాంతం చేస్తున్నారంటూ కేసీఆర్ మండిపడ్డారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం పోరాటం చేస్తుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు, కరెంట్ ఖర్చు ఇంతే: కేసీఆర్ 

మేడిగడ్డ వద్ద గోదావరికి కేసీఆర్ పూజలు (వీడియో)

కాళేశ్వరం పర్యటన... సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే(వీడియో)