Asianet News TeluguAsianet News Telugu

అరవింద్ ‌కు బిగుస్తున్న ఉచ్చు: ఫార్మూలా ఈ-రేస్ కు రూ. 50 కోట్ల విడుదలపై మెమో జారీ


ఫార్మూలా ఈ -రేస్ విషయంలో  అరవింద్ కుమార్ కు కాంగ్రెస్ సర్కార్ ఉచ్చు బిగిస్తుంది.

Telangana Chief Secretary shanthi kumari issue memo to former HMDA commissioner Arvind Kumar, questions on Formula-E lns
Author
First Published Jan 9, 2024, 11:58 AM IST

హైదరాబాద్: తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ  అరవింద్ కుమార్ కు  తెలంగాణ ప్రభుత్వం  మెమో జారీ చేసింది.  ఫార్మూలా-ఈ రేస్ నిర్వహణపై  అరవింద్ కుమార్ ను  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  వారం రోజుల్లో  వివరణ ఇవ్వాలని కోరింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి  స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కు  మెమో జారీ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో  భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో  మున్సిఫల్ శాఖతో పాటు పలు కీలక శాఖల్లో  అరవింద్ కుమార్ పనిచేశారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  మున్సిఫల్ శాఖ నుండి  అరవింద్ కుమార్ ను  విపత్తు నిర్వహణ శాఖకు  ప్రభుత్వం బదిలీ చేసింది. 

also read:ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: గెలుపునకు కావాల్సిన ఓట్లను ఎలా నిర్ధారిస్తారు

బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం  ఫార్మూలా ఈ రేస్  విషయమై  ఒప్పందం జరిగింది.ఈ ఒప్పందం మేరకు  ఈ ఏడాది ఫిబ్రవరి 10న హైద్రాబాద్ లో  ఫార్మూలా ఈ రేస్  పోటీలు నిర్వహించాల్సి ఉంది. అయితే  తెలంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  ఈ రేస్ విషయమై  సానుకూలంగా స్పందించలేదని  నిర్వాహకులు ప్రకటించారు. దీంతో  ఫార్మూలా ఈ రేస్  ను రద్దు చేస్తున్నట్టుగా గత వారంలో  నిర్వాహకులు ప్రకటించారు. 

also read:కాంగ్రెస్‌కు కలిసొస్తున్న ఈసీ నిర్ణయం: రెండు ఎమ్మెల్సీ స్థానాలు హస్తం పార్టీకేనా?

అయితే  ఫార్మూలా  ఈ రేస్  9, 10 సీజన్లకు  బీఆర్ఎస్ ప్రభుత్వంతో  ఫార్మూలా ఈ రేస్ నిర్వాహకులు  ఒప్పందం చేసుకున్నారు.పార్మూలా ఈ రేస్ నిర్వహణకు  గాను  ప్రభుత్వ అనుమతి లేకుండానే  హెచ్ఎండీఏ నుండి  రూ. 50 కోట్లు బదిలీ చేశారని  స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కు కాంగ్రెస్ సర్కార్ మెమో జారీ చేసింది. తొమ్మిది అంశాలపై  స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న  అరవింద్ కుమార్  కు  రాష్ట్ర  ప్రభుత్వం మెమో జారీ చేసింది. వివరణ సంతృప్తికరంగా లేకపోతే అరవింద్ కుమార్ పై  చర్యలు తీసుకొనే అవకాశాలు లేకపోలేదు. 

also read:ఫార్మూలా ఈ -రేస్ రద్దు:నిర్వాహకుల ప్రకటన

ఫార్మూలా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి  హైద్రాబాద్ ట్యాంక్ బండ్ పై  ట్రాక్ ఏర్పాటుకు సంబంధించి హెచ్ఎండీఏ నుండి  రూ. 50 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధుల విడుదల విషయమై ఎవరు అనుమతిచ్చారని  మెమోలో ప్రశ్నించారు. ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయాలకు సంబంధించి కేబినెట్ అనుమతి తప్పనిసరి.నిబంధనలకు విరుద్దంగా  నిధులు విడుదల చేశారని  కాంగ్రెస్ సర్కార్ అభిప్రాయపడుతుంది.  

నాడు రేవంత్ రెడ్డికి లీగల్ నోటీస్

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో  ఔటర్ రింగ్ రోడ్డు  లీజు విషయమై  అప్పట్లో పీసీసీ చీఫ్  గా ఉన్న రేవంత్ రెడ్డి  ఆరోపణలు చేశారు.ఈ ఆరోపణలపై  హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్  రేవంత్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపారు. ఈ నోటీసులు వెనక్కి తీసుకోవాలని రేవంత్ రెడ్డి అప్పట్లో కోరారు. ఓఆర్ఆర్ లీజు విషయమై  తాను అడిగిన సమాచారం ఇవ్వకుండా  తాను  ప్రస్తావించిన ఆరోపణలపై  లీగల్ నోటీసులు ఇవ్వడంపై  రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో  బీఆర్ఎస్ సర్కార్ స్థానంలో  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.  ఫార్మూలా ఈ రేస్  విషయంలో అరవింద్ కుమార్ కు మెమో పంపింది సర్కార్.

Follow Us:
Download App:
  • android
  • ios