Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్‌కు కలిసొస్తున్న ఈసీ నిర్ణయం: రెండు ఎమ్మెల్సీ స్థానాలు హస్తం పార్టీకేనా?

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు  ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు  ఎన్నికలు జరగనున్నాయి.  ఈ నెల  29న  ఎన్నికలు జరగుతాయి.

MLA Quota MLC poll: Election Commission decision to help Congress win both MLC seats lns
Author
First Published Jan 6, 2024, 11:58 AM IST

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో  రెండు  స్థానాలను కాంగ్రెస్ పార్టీ  దక్కించుకొనే అవకాశం ఉంది. ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు  వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేయడంతో పాటు  వేర్వేరుగా  పోలింగ్  కేంద్రాలు  ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం  ఆదేశాలు  జారీ చేసింది. దీంతో  ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో  కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొనే  అవకాశం ఉంది.  

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  కడియం శ్రీహరి,  పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పదవులకు   రాజీనామా చేశారు. స్టేషన్ ఘన్ పూర్ నుండి  కడియం శ్రీహరి, హుజూరాబాద్ నుండి  కౌశిక్ రెడ్డి  భారత రాష్ట్ర సమితి అభ్యర్థులు పోటీ చేసి విజయం సాధించారు.  

also read:తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్: కాంగ్రెస్ ఆశావాహులు వీరే

దీంతో  ఎమ్మెల్సీ పదవులకు  రాజీనామాలు చేశారు. ఎమ్మెల్సీ పదవులకు  రాజీనామాలు చేయడంతో  ఈ రెండు స్థానాలకు  ఎన్నికల నిర్వహణకు గాను  కేంద్ర ఎన్నికల సంఘం  రెండు రోజుల క్రితం  షెడ్యూల్ విడుదల చేసింది.  ఈ నెల  29న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల  12న  ఎమ్మెల్సీ  ఎన్నికలకు సంబంధించి  నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ 64 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది.  కాంగ్రెస్ పార్టీ మద్దతుతో  సీపీఐ అభ్యర్ధి  ఒకరు  విజయం సాధించారు.  తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, మిత్రపక్షాల బలం  65కు చేరుకుంది.తెలంగాణ అసెంబ్లీలో  భారత రాష్ట్ర సమితి బలం  39.  బీజేపీకి ఎనిమిది మంది  ఎమ్మెల్యేలున్నారు. ఎంఐఎంకు  ఏడుగురు  ఎమ్మెల్యేలున్నారు. బీఆర్ఎస్,ఎంఐఎం మధ్య స్నేహం ఉంది.  

also read:తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు: బీఆర్ఎస్‌లో ఆశావాహులు వీరే

సాధారణంగా వేర్వేరుగా కాకుండా  ఒకే నోటిఫికేషన్ విడుదల చేస్తే  బీఆర్ఎస్, కాంగ్రెస్  పార్టీలు ఒక్కో ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకొనే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో  వేర్వేరుగా  నోటిఫికేషన్లు విడుదల చేయడం ద్వారా  కాంగ్రెస్ పార్టీకి  ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. రెండు స్థానాలకు  వేర్వేరుగా పోలింగ్ నిర్వహించనున్నారు.  వేర్వేరుగా ఎన్నిక నిర్వహించడం వల్ల  కాంగ్రెస్ పార్టీకి  రెండు స్థానాలు దక్కే అవకాశం ఉంది.  తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 64 సభ్యుల బలం ఉంది.  ఒక్క ఎమ్మెల్సీ  దక్కాలంటే  కనీసం  59.5 ఓట్లు దక్కాలి.  కాంగ్రెస్ పార్టీకి ఈ ఓట్లున్నాయి. కానీ, భారత రాష్ట్ర సమితికి 59.5 ఓట్లు దక్కే అవకాశం లేదు.  దీంతో రెండు స్థానాలు  కాంగ్రెస్ పార్టీకే దక్కే అవకాశం ఉందనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇస్తారు

రాజీనామా చేసిన సభ్యుల పదవీ కాలం వేర్వేరుగా ఉన్న సమయంలో  వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేస్తారు. అంతేకాదు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహిస్తారు.2027 నవంబర్ 30వ తేదీన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిల పదవీ కాలం ఉంది. అయితే  ఒకేసారి వీరి పదవీ కాలం ఉన్నప్పటికి వేర్వేరుగా ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఇప్పుడు  ఒక్కో ఎమ్మెల్సీని ఎన్నుకోవాలంటే  119 మంది ఎమ్మెల్యేలు ఓటర్లుగా ఉంటారు.దరిమిలా తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నందున ఆ పార్టీకే రెండు ఎమ్మెల్సీలు దక్కే అవకాశం ఉందని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రెండు స్థానాలకు  వేర్వేరుగా ఎన్నికల నిర్వహణకు  రెండు బ్యాలెట్ పేపర్లను సిద్దం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం  ఆదేశాలు జారీ చేసింది. ఒకటి తెలుపు రంగులో, మరోటి  గులాబీ రంగులో బ్యాలెట్ పేపర్లను సిద్దం చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు ఎన్నికలకు సంబంధించి  వేర్వేరుగా  ఓటరు జాబితాను తయారు చేయాలని కోరింది. కడియం శ్రీహారి రాజీనామా చేసిన స్థానానికి పోటీ చేస్తున్నారా,  పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేసిన స్థానానికి పోటీ చేస్తున్నారా అనే విషయమై కూడ స్పష్టంగా పేర్కొనాలని ఎన్నికల సంఘం సూచించింది. మరో వైపు  ఈ ఎన్నికలకు సంబంధించి  వేర్వేరుగా ఎన్నికల అధికారులను నియమించాలని కూడ  ఈసీ ఆదేశాలు జారీ చేసింది.  మరోవైపు  ఈ విషయమై  కేంద్ర ఎన్నికల సంఘాన్ని సమాచారం కోరుతూ  అసెంబ్లీ అధికారులు  లేఖ రాశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios