ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: గెలుపునకు కావాల్సిన ఓట్లను ఎలా నిర్ధారిస్తారు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో  అవసరమైన ఎమ్మెల్యే ఓట్లను ఎలా లెక్కిస్తారోననే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఎమ్మెల్యేల సంఖ్య,ఖాళీల సంఖ్య ఆధారంగా  ఈ లెక్కను తేలుస్తారు.
 

MLA Quota MLC Elections: How  MLAs' votes determined?  lns

హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న  రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి  కేంద్ర ఎన్నికల సంఘం  షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ నెల  29న పోలింగ్ నిర్వహించనున్నారు. 

కడియం శ్రీహరి , పాడి కౌశిక్ రెడ్డిలు  ఎమ్మెల్యేలుగా విజయం సాధించడంతో  ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు  ఎన్నికలను నిర్వహించనున్నారు.  స్టేషన్ ఘన్ పూర్ నుండి కడియం శ్రీహరి, హుజూరాబాద్ నుండి కౌశిక్ రెడ్డి భారత రాష్ట్ర సమితి అభ్యర్థులుగా  ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. దీంతో  ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. దీంతో  రెండు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం  ప్రకటించింది. 

also read:కాంగ్రెస్‌కు కలిసొస్తున్న ఈసీ నిర్ణయం: రెండు ఎమ్మెల్సీ స్థానాలు హస్తం పార్టీకేనా?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్ని ఓట్లు కావాలనే విషయాన్ని ఎలా నిర్ధారిస్తారో ఒక్కసారి చూద్దాం.తెలంగాణ అసెంబ్లీలో  మొత్తం  ఎమ్మెల్యేల సంఖ్య 119. మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యతో పాటు ఎన్నిక నిర్వహించాల్సిన సభ్యుల సంఖ్యకు ఒక్కటి కలపాలి. ఈ మొత్తం సంఖ్యను  భాగించాల్సి ఉంటుంటి. ఆ వచ్చే  ఫలితమే  ఒక్కో ఎమ్మెల్సీ ఎన్నికకు కావాల్సిన ఎమ్మెల్యేల ఓట్ల సంఖ్యగా మారుతుంది. 

also read:ఫార్మూలా ఈ -రేస్ రద్దు:నిర్వాహకుల ప్రకటన

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో  119 మంది సభ్యుల సంఖ్య.  ఎమ్మెల్యే కోటా కింద  రెండు ఎమ్మెల్సీ స్థానాలకు  ఎన్నికలు జరగాల్సి ఉంది.  119 సభ్యులకు  రెండు ఎమ్మెల్సీ స్థానాల ఖాళీలను కలిపితే  121 అవుతుంది. ఈ సంఖ్యకు 1 కలపాలి. దీంతో ఈ సంఖ్య  122 అవుతుంది. దీన్ని బాగిస్తే వచ్చే ఫలితమే ఎమ్మెల్సీ స్థానానికి కావాల్సిన ఎమ్మెల్యేల ఓట్ల సంఖ్యగా గుర్తిస్తారు.

తెలంగాణలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు   వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసి  వేర్వేరుగా  పోలింగ్ నిర్వహించాలని  ఎన్నికల సంఘం  షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించడంతో  తెలంగాణలోని  రెండు ఎమ్మెల్సీ స్థానాలకు  59.5 ఎమ్మెల్యేల  ఓట్లు అవసరమౌతుంది.  తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి  64 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో  కాంగ్రెస్ బలం  65కు చేరుతుంది.  వేర్వేరుగా  ఎన్నికలు నిర్వహించడం ద్వారా రెండు ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ దక్కించుకుంటుంది.

also read:తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు: బీఆర్ఎస్‌లో ఆశావాహులు వీరే

ఇక తెలంగాణ రాష్ట్రంలో  ఒకే నోటిఫికేషన్ ద్వారా రెండు స్థానాలకు  ఎన్నికలు  నిర్వహిస్తే  ఒక్క ఎమ్మెల్సీ  పదవిని దక్కించుకోవాలంటే  39.6 ఓట్లు అవసరం.  అలా జరిగితే  తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా  భారత రాష్ట్ర సమితి,  కాంగ్రెస్ పార్టీకి ఒక్కో ఎమ్మెల్సీ దక్కేది.  కానీ, ప్రస్తుతం  రెండు  ఎమ్మెల్సీ ఎన్నికలకు  వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేయడం ద్వారా   ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్ కు దక్కే అవకాశం ఉందని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios