Asianet News TeluguAsianet News Telugu

ఫార్మూలా ఈ -రేస్ రద్దు:నిర్వాహకుల ప్రకటన

తెలంగాణలో  ఈ ఏడాది ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన  ఫార్మూలా ఈ రేస్ ను రద్దు చేస్తున్నట్టుగా  నిర్వాహకులు ప్రకటించారు.

Formula E cancels Hyderabad E-Prix for 2024 lns
Author
First Published Jan 6, 2024, 9:59 AM IST

హైదరాబాద్:ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన జరగాల్సిన ఫార్మూలా ఈ -రేస్ ను రద్దు చేస్తున్నట్టుగా   నిర్వాహకులు ప్రకటించారు.. ఈ -రేస్  విషయమై  ప్రభుత్వం  స్పందించకపోవడంతో రద్దు చేస్తున్నట్టుగా ఎఫ్ఐఏ ప్రకటించింది.

 

భారతదేశంలో రెండో ఫార్మూలా ఈ రేస్  ఈ ఏడాది ఫిబ్రవరి  10న జరగాల్సి ఉంది.   తమతో  చేసుకున్న  ఒప్పందాన్ని తెలంగాణ మున్సిఫల్ శాఖఉల్లంఘిస్తుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. దీంతో  ఈ ఏడాది ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన  ఈ రేస్ ను  రద్దు చేసుకోవాలని నిర్వాహకులు  నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో  హైద్రాబాద్ లో  ఎఫ్ఐఏ ఫార్ములా ఈ రేసింగ్  నిర్వహించారు.గత ఏడాది  ప్రారంభంలో  ఫార్మూలా ఈ రేస్ నిర్వహించారు.  దీంతో  ఈ ఏడాది ఫిబ్రవరి  10వ తేదీన ఈ పోటీలను నిర్వహించాలని గతంలోనే  నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు  2023 అక్టోబర్  30న  కేసీఆర్ సర్కార్ ఒప్పందం చేసుకుంది.  

2023 నవంబర్ మాసంలో  తెలంగాణలో  ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో   బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయి  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేస్ పై  ఆసక్తి చూపలేదనే అభిప్రాయంతో  నిర్వాహకులున్నారు. దీంతో  ఈ రేస్ నిర్వహణను రద్దు చేసుకుంటున్నట్టుగా నిర్వహకులు ప్రకటించారు.ఈ సీజన్  లో  టోక్యో,  షాంఘై, బెర్లిన్, మొనాకో, లండన్ నగరాలున్నాయి.  జనవరి  13న ఈ సీజన్ ప్రారంభం కానుంది.  మెక్సికోలోని  హాంకూక్ లో తొలి రేస్ జరగనుంది.

Follow Us:
Download App:
  • android
  • ios