Asianet News TeluguAsianet News Telugu

త్వరలోనే మరోసారి తెలంగాణ కేబినెట్ కీలక భేటీ, అసెంబ్లీ రద్దుపైనే చర్చ?

సెప్టెంబర్ 4వ తేదీ వరకు అన్ని శాఖల నుండి  ప్రతిపాదనలు పంపాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 5 లేదా 6వ తేదీన  మరో సారి తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది.ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలకు  సంబంధించి చర్చించే అవకాశం ఉన్నట్టు చర్చ సాగుతోంది

Telangana cabinet will be meeting soon
Author
Hyderabad, First Published Sep 2, 2018, 3:11 PM IST


హైదరాబాద్: ఈ నెల ఐదు లేదా 6వ తేదీన మరోసారి తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగే అవకాశం లేకపోలేదు. సెప్టెంబర్ 4వ తేదీ నాటికి అన్ని శాఖల నుండి కీలకమైన ప్రతిపాదనలు పంపాలని ఆయా శాఖలకు ఆదేశాలు వెళ్లాయి..ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలకు  సంబంధించి చర్చించే అవకాశం ఉన్నట్టు చర్చ సాగుతోంది. సెప్టెంబర్ రెండో తేదిన జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించని అంశాలను త్వరలోనే జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అధికారాన్ని సీఎం కేసీఆర్ కు కట్టబెడుతూ టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నిర్ణయం తీసుకొన్నారు.

అయితే  తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల విషయమై ఎప్పుడు నిర్ణయం తీసుకొంటారనే విషయమై  తెలంగాణ  రాజకీయపార్టీల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాలుగున్నర ఏళ్లుగా తెలంగాణ ప్రజల కోసం తమ ప్రభుత్వం ఏం చేసిందనే అంశాలను వివరించే ఉద్దేశ్యంతోనే  ప్రగతి నివేదన సభను ఏర్పాటు చేశారు. అంతేకాదు రానున్న  రోజుల్లో కూడ ఏం చేయనున్నారనే అంశాలను కూడ  ఈ సభలో కేసీఆర్ ప్రస్తావించనున్నారు.

ఇదిలా ఉంటే  మరో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని  సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.  అయితే ఈ కేబినెట్ సమావేశంలో  అన్ని అంశాలను చర్చించనున్నట్టు  డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మీడియాకు వివరించారు.అయితే ఈ కేబినెట్ సమావేశాన్ని సెప్టెంబర్ 5 లేదా 6వ తేదీల్లో  నిర్వహించే అవకాశం లేకపోలేదని సమాచారం.

ముందస్తు ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ రద్దు వ్యవహరం విషయమై త్వరలోనే జరిగే  కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ముందస్తు ఎన్నికల అంశానికి సంబంధించిన అంశంలో సీఎం కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకొంటారనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఈ సస్పెన్స్ వచ్చే కేబినెట్ సమావేశం వరకు కొనసాగుతూనే ఉంటుంది.

అసెంబ్లీని రద్దు చేయాలంటే కేబినెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే త్వరలో జరిగే కేబినెట్ లో  ఈ విషయమై ప్రధానంగా ఎజెండాగా మారే అవకాశం లేకపోలేదు. 

 అసెంబ్లీ రద్దు చేసే విషయమై నిర్ణయం తీసుకొనేలోపుగా  ప్రభుత్వపరంగా  తీసుకొనే ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు తదితర విషయాలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ముందస్తు ఎన్నికలకు సంబంధించిన కీలకమైన నిర్ణయాన్ని తీసుకొనే అవకాశం లేకపోలేదని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


ఈ వార్తలు చదవండి

ఆ విషయం మోడీకి, రాహుల్‌కు తెలుసు: కేటీఆర్ సంచలనం

అర్చకుల వయో పరిమితి 65 ఏళ్లకు పెంపు: తెలంగాణ కేబినెట్ నిర్ణయం

హెలికాప్టర్లలో కొంగర కొలాన్ కు బయలు దేరిన మంత్రులు

అసెంబ్లీ రద్దు ఫైనల్ నిర్ణయం సీఎం కేసీఆర్ దే: ఎంపీ కవిత

 

Follow Us:
Download App:
  • android
  • ios