Asianet News TeluguAsianet News Telugu

అసెంబ్లీ రద్దుపై తుది నిర్ణయం కేసీఆర్ దే: ఎంపీ కవిత

అసెంబ్లీ రద్దు వంటి అంశాల్లో ఫైనల్ నిర్ణయం సీఎం కేసీఆర్ దేనని టీఆర్ఎస్ ఎంపీ కవిత స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ ఎస్ దే గెలుపునని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నిర్ణయం కోసం అందరూ ఎదురుచూస్తున్నారన్నారు. 

Trs mp Kavitha on pragathi nivedana sabha
Author
Hyderabad, First Published Sep 2, 2018, 3:21 PM IST


హైదరాబాద్ : అసెంబ్లీ రద్దు వంటి అంశాల్లో ఫైనల్ నిర్ణయం సీఎం కేసీఆర్ దేనని టీఆర్ఎస్ ఎంపీ కవిత స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ ఎస్ దే గెలుపునని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నిర్ణయం కోసం అందరూ ఎదురుచూస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచినాలుగేళ్ల ప్రగతిని సభ ద్వారా సీఎం వివరిస్తారని కవిత స్పష్టం చేశారు. 

మరోవైపు ప్రగతి నివేదన సభ ద్వారా టీఆర్ ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ప్రతిపక్షాలు ఆరోపించడాన్ని ఆమె ఖండించారు. అధికార దుర్వినియోగం అనేది ఒట్టిమాటేనని ఆమె తెలిపారు. ప్రతిపనికీ, ప్రభుత్వ శాఖలన్నింటికీ టీఆర్ ఎస్ తరపున డబ్బు చెల్లిస్తున్నాం అని స్పష్టం చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios