Asianet News TeluguAsianet News Telugu

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికారు, సిగ్గులేకుండా ఎమ్మెల్యేలను కొన్నారు: బాబుపై జగన్

ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి బ్లాక్‌మనీతో ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన బహుశా ఎవరూ చూసి ఉండకపోవచ్చునన్నారు. అంతటితో ఆగకుండా సిగ్గు లేకుండ ఎమ్మెల్యేను కొనుగోలు చేశారంటూ ధ్వజమెత్తారు. 
 

ys jagan comments on vote for cash issue
Author
Delhi, First Published Mar 2, 2019, 2:39 PM IST


ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ ధ్వజమెత్తారు. 

ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి బ్లాక్‌మనీతో ఆడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన బహుశా ఎవరూ చూసి ఉండకపోవచ్చునన్నారు. అంతటితో ఆగకుండా సిగ్గు లేకుండ ఎమ్మెల్యేను కొనుగోలు చేశారంటూ ధ్వజమెత్తారు. 

ఢిల్లీలో ఇండియాటుడే 18వ ఎడిషన్ కాంక్లేవ్ లో భాగంగా సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ కన్వల్ ముఖాముఖిలో చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆడియో టేపుల్లో ఉన్నది ఆయన గొంతేనని ఫోరెన్సిక్‌ నివేదిక సైతం తేల్చినా చంద్రబాబుపై కేసు నమోదు కాలేదన్నారు. ఆరోపణలపై కనీసం రాజీనామా కూడా చేయలేదంటూ మండిపడ్డారు. 

సాక్షాత్తు ముఖ్యమంత్రి నైతిక విలువలు లేకుండా వ్యవహరించారని అలాంటి చంద్రబాబు ఇప్పుడు అవినీతి అంటూ నీతులు చెప్తున్నారంటూ విరుచుకుపడ్డారు. కానీ కాంగ్రెస్ పార్టీని కాదని ఓదార్పుయాత్ర చేస్తానని ప్రకటిస్తే తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఆరోపించారు.  

కాంగ్రెస్‌ పార్టీ నుంచి తాను బయటకు రాగానే టీడీపీతో కలిసి కేసులు పెట్టారంటూ ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్న నేతలు కేంద్రంతో, రాష్ట్రంతో పోరాడితే కేసులు పెట్టడం చాలా సులభమన్న జగన్ తన తండ్రి చనిపోయిన తర్వాత తాను ప్రతిపక్షంలో ఉండటంతో అధికార అండతో తప్పుడు కేసులు పెట్టారని వైఎస్ జగన్ ఆరోపించారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

మానాన్న చనిపోయాకే కేసులు పెట్టారు ఎందుకంటే.....:జగన్ వ్యాఖ్యలు

నేనే సీఎం అయితే.., నా శత్రువు.. జగన్ కామెంట్స్ (వీడియో)

 

Follow Us:
Download App:
  • android
  • ios