హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఆదివారం నాడు నిరవధికంగా వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత శాసనసభ వాయిదా పడింది.

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 9వ తేదీన ప్రారంభమయాయి.  10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నడిచాయి.  ఈ సమావేశాల్లో మూడు బిల్లులను ప్రవేశపెట్టారు. యురేనియంపై అసెంబ్లీ తీర్మానం చేసింది.

ఈ సమావేశాల్లో అధికార టీఆర్ఎస్ పై విపక్ష కాంగ్రెస్  తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్ బాబులతో పాటు పలువురు టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు.

విపక్ష కాంగ్రెస్  విమర్శలను అధికార పక్షం  కూడ తిప్పికొట్టింది.  భట్టి విమర్శలపై సీఎం కేసీఆర్ స్వయంగా కౌంటర్ ఇచ్చారు.మల్లు భట్టి విక్రమార్క విమర్శలపై కొన్ని సమయాల్లో  కేసీఆర్ పరుష పదజాలాన్ని ఉపయోగించారు.

సంబంధిత వార్తలు

కార్పోరేషన్‌ అప్పు రాష్ట్రానిది కాదా: కేసీఆర్‌పై భట్టి ఫైర్

డార్క్ డే, తల్లిని చంపి బిడ్డను బతికించారు: మోడీ, అమిత్‌షాలపై కేసీఆర్ ఫైర్
అసెంబ్లీలో కేసీఆర్, భట్టి మధ్య వాగ్వాదం: కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనం ముగిసిన కథ

ప్రభుత్వాన్ని శాసించలేరు, కఠిన చర్యలు: ఉద్యోగులపై కేసీఆర్ ఫైర్