హైదరాబాద్: ప్రభుత్వాన్ని ఉద్యోగులు  శాసించలేరని  తెలంగాణ సీఎం కేసీఆర్  స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడా కూడ ఈ రకమైన పరిస్థితి లేదన్నారు. శాసనసభ, ఎమ్మెల్యేలు చట్టాలను చేస్తాయని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రభుత్వం చెప్పిన పనులను ఉద్యోగులు చేయాల్సిందేని కేసీఆర్ తేల్చి చెప్పారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు.

ఆదివారం నాడు ద్రవ్య వినిమయ  బిల్లుపై చర్చ సందర్భంగా  తెలంగాణ సీఎం కేసీఆర్  ఉద్యోగులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తమ ప్రభుత్వం రెవిన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్టుగా కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. 

 కొత్త రెవిన్యూ చట్టం చాలా అద్భుతంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చట్టాన్ని ప్రపంచం మొత్తం కూడ కాపీ కొట్టే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. కొత్త రెవిన్యూ చట్టం గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉద్యోగులపై తమ ప్రభుత్వ వైఖరిని కుండబద్దలు కొట్టారు.

చట్టాలను ఉద్యోగులు రూపొందించరు, ఉద్యోగులు చెప్పినట్టుగా ప్రభుత్వాలు నడుచుకోవని ఆయన తేల్చి చెప్పారు. ప్రభుత్వాలను ఉద్యోగులు డైరెక్ట్ చేయలేరన్నారు.  ప్రభుత్వం నిర్ధేశించిన పనులను అవినీతి రహితంగా ఉద్యోగులు చేయాల్సిందేనని కేసీఆర్ తేల్చి చెప్పారు. పారదర్శకంగా ఉద్యోగులు పనిచేయాలనేది తమ ప్రభుత్వ అభిమతమని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు.

ఉద్యోగులు చెప్పినట్టుగానే శాసనసభ నడిస్తే  ఎమ్మెల్యేలు, మనం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, అసెంబ్లీ చట్టాలు చేస్తాయని ఆయన ఉద్యోగులకు గుర్తు చేశారు.  కొత్త రెవిన్యూ చట్టం చేసే ముందు రెవిన్యూ ఉద్యోగులతో కూడ మాట్లాడుతామని ఆయన ప్రకటించారు.

కానీ, అనవసరంగా రోడ్లపైకి వస్తే మీరే నష్టపోతారని ఆయన రెవిన్యూ ఉద్యోగులను హెచ్చరించారు. ఉద్యోగుల కోసమే ప్రభుత్వం ఉండదని ఆయన తేల్చి చెప్పారు. కొత్త రెవిన్యూ చట్టంలో కొందరిని  అవసరమైతే మార్చాల్సి వస్తే రావొచ్చని కూడ ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

డార్క్ డే, తల్లిని చంపి బిడ్డను బతికించారు: మోడీ, అమిత్‌షాలపై కేసీఆర్ ఫైర్
అసెంబ్లీలో కేసీఆర్, భట్టి మధ్య వాగ్వాదం: కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనం ముగిసిన కథ