Asianet News TeluguAsianet News Telugu

కార్పోరేషన్‌ అప్పు రాష్ట్రానిది కాదా: కేసీఆర్‌పై భట్టి ఫైర్

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైరయ్యారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల కోసం తీసుకొచ్చిన అప్పులను గురించి తాను అసెంబ్లీలో ప్రశ్నిస్తే కేసీఆర్ వితండవాదం చేస్తున్నారంటూ భట్టి మండిపడ్డారు. 

telangana clp leader bhatti vikramarka comments on cm kcr
Author
Hyderabad, First Published Sep 22, 2019, 3:40 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైరయ్యారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల కోసం తీసుకొచ్చిన అప్పులను గురించి తాను అసెంబ్లీలో ప్రశ్నిస్తే కేసీఆర్ వితండవాదం చేస్తున్నారంటూ భట్టి మండిపడ్డారు.

కార్పోరేషన్ పేరిట తీసుకొచ్చే అప్పులకు హామీగా ఉండేది తెలంగాణ ప్రభుత్వమేనని అటువంటప్పుడు అది రాష్ట్రానికి చెందిన అప్పేనని విక్రమార్క స్పష్టం చేశారు.

కానీ ముఖ్యమంత్రి మాత్రం కార్పోరేషన్ల పేరిట తీసుకొచ్చిన రుణాల్ని రాష్ట్ర అప్పు కాదని చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఇది తెలంగాణకు ప్రమాదకరమని విక్రమార్క మండిపడ్డారు.

ల్యాండ్ రెవెన్యూ చట్టంలో అనుభవదారులు, కౌలుదారులకు కేసీఆర్ లింక్ పెట్టి మాట్లాడుతున్నారని.. కానీ ఈ రెండు అంశాలు వేరు వేరని భట్టి తెలిపారు. కౌలుదారులు రైతు వద్ద పంట తీసుకుని సాగు చేసే వారని వాళ్లు అనుభవదారుల కిందకు రారన్నారు.

తెలంగాణ అసెంబ్లీలో ఆదివారం నాడు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సమయంలో కాంగ్రెస్ సభ్యుడు  మల్లు భట్టి విక్రమార్క విమర్శలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఘాటుగా స్పందించారు.

తమ పార్టీలో చేరుతామని  కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చేరుతామని  లేఖలు రాశారు, అంతేకాదు అవసరమైతే తమ పదవులకు రాజీనామా చేస్తామన్నారు. ఈ లేఖలు కూడ తనకు వచ్చాయన్నారు. తనను కలిసిన ఎమ్మెల్యేలను కూడ పార్టీలో చేరుతామని చెబితే తాము ఒప్పుకోలేదన్నారు.

సుమారు 12 మంది ఎమ్మెల్యేలు విలీనమైతే అనర్హత వేటు నుండి తప్పించుకొనే అవకాశం ఉందని  చెబితే  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 12 మంది  తమ పార్టీలో విలీనమైనట్టుగా కేసీఆర్ చెప్పారు.

రాజస్థాన్ లో ఆరుగురు బిఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొన్నారన్నారు.గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకొన్నారని ఆయన చెప్పారు. ఏపీ రాష్ట్రానికి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీలో విలీనమయ్యారని ఉప రాష్ట్రపతి బులెటిన్ కూడ విడుదల చేశారని  ఆయన గుర్తు చేశారు.

డార్క్ డే, తల్లిని చంపి బిడ్డను బతికించారు: మోడీ, అమిత్‌షాలపై కేసీఆర్ ఫైర్
అసెంబ్లీలో కేసీఆర్, భట్టి మధ్య వాగ్వాదం: కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనం ముగిసిన కథ

ప్రభుత్వాన్ని శాసించలేరు, కఠిన చర్యలు: ఉద్యోగులపై కేసీఆర్ ఫైర్

Follow Us:
Download App:
  • android
  • ios