Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల.. నామినేషన్ల స్వీకరణ షురూ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నేటి నుంచి అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించవచ్చు. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ (Gazette Notification) విడుదల చేసింది. నేటి (శుక్రవారం) ఉదయం 11 గంటల తరువాత నామినేషన్ల ప్రక్రియ (Nominations Process) షురూ కానుంది. దీని కోసం 11 గంటలకు ఫారం -1 నోటీసును అధికారులు విడుదల చేసేందుకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
నా కుమారుడి పేరులో కూడా ‘చంద్రశేఖర్’ ఉంది - కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తో ఎలాన్ మస్క్
గెటిట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ గవర్నర్ అనుమతి కూడా తీసుకుంది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై ఈ నెల 10వ తేదీన ముగియనుంది. . 13న నామినేషన్ల పరిశీలన.. ఈ నెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అదే రోజున ఈసీ అభ్యర్ధుల తుది జాబితాను ప్రకటించనుంది.
జానారెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు: రెండో రోజూ కాంగ్రెస్ నేతల ఇళ్లలో సాగుతున్న దాడులు
రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ప్రతీ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అయితే ఈ నెల 8 నుంచి 10 వరకు మంచి ముహూర్తాలు వుండటంతో అభ్యర్ధులు ఈ రోజుల్లోనే నామినేషన్లు దాఖలు చేసే అవకాశం వుంది. నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును ఈసీ లెక్కలోకి తీసుకోనుంది.
బెనారస్ ఐఐటీలో షాకింగ్..విద్యార్థిని బట్టలు విప్పించి, వీడియోల తీసిన దుండగులు...
కాగా.. ఈ నెల 30న ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మరోవైపు.. ఎన్నికల్లో పోటీ చేసే జనరల్, బీసీ అభ్యర్ధులు రూ.10 వేలు.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు 5 వేలు డిపాజిట్ చేయాల్సి వుంటుంది. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్ధితో పాటు ఐదుగురికి మాత్రమే రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోకి అనుమతించనున్నారు.