Asianet News TeluguAsianet News Telugu

బెనారస్ ఐఐటీలో షాకింగ్..విద్యార్థిని బట్టలు విప్పించి, వీడియోల తీసిన దుండగులు...

ఐఐటీ క్యాంపస్ సరిహద్దులను జనావాసాల నుంచి వేరు చేయాలని, నిందితుల ఆచూకీ తొందరగా కనిపెట్టాలని కొందరు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు సీసీటీవీ కెమెరాలు పనిచేయడంపై మెమోరాండం కూడా ఇచ్చారు.

Shocking in IIT Banaras, student stripped, molested and videos  taken - bsb
Author
First Published Nov 3, 2023, 7:43 AM IST | Last Updated Nov 3, 2023, 7:43 AM IST

వారణాసి : అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. విద్యాలయాలు కీచకులకు అడ్డాలుగా మారుతున్నాయి. తోటి విద్యార్థులు,  ఉపాధ్యాయులు విద్యార్థినుల పాలిట యమకింకరులుగా మారుతున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తూ.. దిగ్భ్రాంతికి గురి చేస్తున్నారు. అలాంటి ఓ దారుణమైన ఘటన వారణాసిలో వెలుగు చూసింది.

బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఐఐటి బీహెచ్యూ చదువుతున్న విద్యార్థినిపై కొందరు అఘాయిత్యానికి పాల్పడ్డారు. యూనివర్సిటీలోకి ముగ్గురు దుండగులు బైక్ పై వచ్చారు. ఓ విద్యార్థినిపై  వేధింపులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆమె బట్టలు విప్పించారు. అదంతా వీడియో తీశారు. ఆ తర్వాత ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

భార‌త యూజ‌ర్ల‌కు షాకిచ్చిన మెటా.. ఒక్క‌నెల‌లోనే 71 లక్షల వాట్సాప్ ఖాతాలు బ్యాన్.. ఎందుకంటే..?

దీనికి సంబంధించిన వివరాలలోకి పెడితే… బుధవారం రాత్రి ఓ విద్యార్థిని  తన స్నేహితుడితో కలిసి హాస్టల్ కు దగ్గర్లో ఉన్న కర్మన్ బాబా ఆలయానికి వెళ్లింది. ఆ సమయంలోనే ఆలయం దగ్గరికి ముగ్గురు గుర్తు తెలియని దుండగులు వచ్చారు. స్నేహితుడితో ఉన్న బాధితురాలిని టార్గెట్ చేశారు. ఆమెని బలవంతంగా ఓవైపుకు లాక్కెళ్లారు. అక్కడ అసభ్యంగా వేధింపులకు పాల్పడ్డారు. ఆమెతో దుస్తులన్నీ తీయించారు. నగ్నంగా చేసి వీడియోలు చిత్రీకరించారు. ఫోటోలు తీశారు.

ఈ దురాగతం 15 నిమిషాల పాటు కొనసాగింది. ఆ తర్వాత బాధితురాలు సెల్ ఫోన్ నెంబర్ తీసుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాసేపటికి ఈ షాక్ నుంచి తేరుకున్న బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గుర్తుతెలియని దుండగుల మీద వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. వారి కోసం గాలిస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios