Asianet News TeluguAsianet News Telugu

నా కుమారుడి పేరులో కూడా ‘చంద్రశేఖర్’ ఉంది - కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తో ఎలాన్ మస్క్

టెస్లా అధినేత కుమారుల్లో ఒకరికి పేరు ‘చంద్రశేఖర్’ అని పెట్టారని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు. ఈ విషయాన్ని మస్క్ కేంద్ర మంత్రితో షేర్ చేసుకున్నారు. దీనిని రాజీవ్ చంద్రశేఖర్ ‘ఎక్స్’ పోస్టులో వెల్లడించారు. 

Chandrasekhar is also in my son's name - Elon Musk with Union Minister Rajeev Chandrasekhar..ISR
Author
First Published Nov 3, 2023, 9:58 AM IST

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత తన కుమారుల్లో ఒకరికి చంద్రశేఖర్ అనే పేరు పెట్టారు. స్వయంగా  కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తో మస్క్ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని రాజీవ్ చంద్రశేఖర్ గురువారం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ఏఐ సేఫ్టీ సమ్మిట్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించేందుకు యూకే వెళ్లిన కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తో భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా ఎలాన్ మస్క్.. రాజీవ్ చంద్రశేఖర్ తో మాట్లాడుతూ.. తన టెక్ వెంచర్ క్యాపిటలిస్ట్ శివోన్ జిలిస్ తో కలిగిన కుమారుడికి నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ పేరు కలిసి వచ్చేలా ‘చంద్రశేఖర్’ అనే మిడిల్ నేమ్ పెట్టామని తెలిపారు. ఈ విషయాన్ని ‘ఎక్స్’ పోస్ట్ లో పోస్టు చేశారు. ‘‘యూకేలోని బ్లెచ్లీ పార్క్ లో జరిగిన ఏఐ సేఫ్టీ సమ్మిట్ లో నేను ఎవరిని కలిశానో చూడండి.. 1983 నోబెల్ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎస్ చంద్రశేఖర్ పేరు మీదుగా శివోన్ జిలిస్ తో తన కుమారుడికి 'చంద్రశేఖర్' అనే పేరు వచ్చిందని ఎలన్ మస్క్ తెలిపారు.’’ అని పేర్కొన్నారు. 

ఈ పోస్టుకు ఎలాన్ మస్క్ భార్య స్పందించారు. ‘‘అవును నిజమే. మేము అతడిని సంక్షిప్తంగా శేఖర్ అని పిలుస్తాము. మా పిల్లల వారసత్వం, అద్భుతమైన సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గౌరవార్థం ఈ పేరును ఎంచుకున్నాము’’ అని ఎక్స్ లో పేర్కొన్నారు. కాగా.. నక్షత్రాల నిర్మాణం, పరిణామానికి ప్రాముఖ్యత కలిగిన భౌతిక ప్రక్రియల సైద్ధాంతిక అధ్యయనాలకు భారతీయ ఖగోళ శాస్త్రవేత్త భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. 

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ప్రముఖ బ్రిటిష్ గణిత శాస్త్రవేత్త అలాన్ ట్యూరింగ్ బృందం ఎనిగ్మా కోడ్ ను ఉల్లంఘించిన ఆధునిక కంప్యూటింగ్ కు నిలయమైన బకింగ్ హామ్ షైర్ లోని బ్లెచ్లీ పార్క్ లో బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ నిర్వహించిన కృత్రిమ మేధస్సు (ఏఐ) భద్రతా సమావేశంలో చంద్రశేఖర్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా యూకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ శాఖ సహాయ మంత్రి జొనాథన్ కామ్రోస్, ఆస్ట్రేలియా పరిశ్రమలు, సైన్స్ మంత్రి ఎడ్ హుసిక్ తో ఆయన పలు సమావేశాలు నిర్వహించారు. ఇందులో టెక్ భవిష్యత్తుపై నిర్ణయాన్ని బడా టెక్ హౌజ్ లకే వదిలేయకూడదని, ఇంటర్నెట్ లో యూజర్ల భద్రత, నమ్మకాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలని, చేయాల్సినవి, చేయకూడనివి అనే ఫ్రేమ్ వర్క్ పై ఏకాభిప్రాయానికి రావాలని చర్చించారు. 

ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా సృజనాత్మక సాంకేతిక పరిజ్ఞానం కోసం భారతదేశ దార్శనికతను వివరించడానికి రెండు రోజుల శిఖరాగ్ర సదస్సులో మొదటి రోజైన బుధవారం చంద్రశేఖర్ ప్రారంభ ప్లీనరీ సెషన్లో ప్రసంగించారు. రెండు రోజుల సమావేశంలో తొలిరోజు సంతకం చేసిన బ్లెచ్లీ డిక్లరేషన్ భారత్ సహా 28 దేశాల మధ్య 'మైలురాయి' ఒప్పందంగా సునక్ అభివర్ణించారు.

Follow Us:
Download App:
  • android
  • ios