తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. పోలింగ్ మొదలై గంట గడవకముందే.. ఆందోళనలను మొదలయ్యాయి. శేరిలింగంపల్లిలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. టీడీపీ ఏజెంట్ ని ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలేదు. టీడీపీ అభ్యర్థి ఏజెంట్ భానుప్రసాద్ సంతకం బదులుగా శ్రీనివాసరావు అనే వ్యక్తి సంతకం చేయడంతో ఏజెంట్ ని అధికారులు లోపలికి పంపించడం కుదరదని చెప్పారు. తమ ఏజెంట్ ని కావాలనే లోపలికి పంపించడం లేదంటూ.. టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

శుక్రవారం ఉదయం ఏడుగంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే. 119 నియోజకవర్గాల్లోని 32,185 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఓటింగ్‌ను ప్రారంభించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుండగా.. మిగిలిన ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

read more news

ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి.. హరీష్ రావు

భూపాలపల్లిలో మొరాయిస్తున్న ఈవీఎంలు.. ప్రారంభంకాని పోలింగ్

ఓటు హక్కు వినియోగించుకున్న హరీష్ రావు

తెలంగాణ ఎన్నికలు: ప్రారంభమైన పోలింగ్

ఓటేసిన మంత్రులు తుమ్మల, జగదీశ్ రెడ్డి