తన భార్యకు బస్సులో సీటు ఇవ్వలేదని మహిళపై ఎస్ఐ దాడి.. జగిత్యాలలో ఘటన

ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో మొదలైన గొడవ తీవ్ర వాగ్వాదంగా మారింది. ఓ మహిళను ఎస్ఐ చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఎస్సీ ఆయనపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.

SI attack on woman for not giving seat to her wife in bus..Incident in Jagitiyala,,ISR

తన భార్యకు సీటు ఇవ్వలేదని ఓ మహిళపై దాడి చేసిన ఎస్ఐ పై పోలీసులు క్రమశిక్షణ చర్యకు తీసుకున్నారు. దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల రూరల్ అఎస్ఐ అనిల్ కుమార్ ను జిల్లా కేంద్రానికి అటాచ్ చేస్తూ ఎస్పీ ఎ.భాస్కర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

ఇదేం సరదా.. వ్యక్తి ప్రైవేట్ పార్ట్స్ లో కంప్రెషర్ పంపుతో గాలి కొట్టిన స్నేహితుడు.. తరువాత ఏం జరిగిందంటే ?

వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట నుంచి ఓ మహిళ తన తల్లితో కలిసి మంగళవారం జగిత్యాలకు వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు. అయితే ఆ బస్సు కరీంనగర్ బస్టాండ్ కు చేరుకున్న తరువాత ఎస్సై భార్య ఎక్కారు. దీంతో ఆ బస్సులో సీటు విషయంలో ఎస్ఐ భార్య, సిద్ధిపేట నుంచి ప్రయాణిస్తున్న మరో మహిళ మధ్య వాగ్వాదం జరిగింది.

మే 13న బీజేపీ గుణపాఠం నేర్చుకుంటుంది - ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్

అయితే బస్సు జగిత్యాలకు చేరుకోగానే అనిల్ కుమార్ బస్సు ఎక్కారు. ఆ మహిళతో వాగ్వాదానికి దిగాడు. ఈ ఘటనను ఆమె తన మొబైల్ ఫోన్ తో రికార్డ్ చేస్తుండగా ఎస్ ఐ ఆమె నుంచి ఫోన్ లాక్కుని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో బాధితురాలు జగిత్యాల టౌన్-1 పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ, అతడి భార్య కూడా తనను దూషించారని, ఎస్ఐ తనను బస్సు నుంచి బయటకు లాగారని బాధితురాలు తెలిపింది. కాగా.. ఈ ఘటనపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ జగిత్యాల ఎస్పీతో మాట్లాడినట్లు ‘తెలంగాణ టు డే’ నివేదించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios