హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు సినీనటుడు నందమూరి హరికృష్ణ తనయ సుహాసిని. మహాకూటమి పొత్తులో భాగంగా కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని టీడీపీ కి కేటాయించింది. 

అయితే ఈ సీటుకోసం టీడీపీ సీనియర్ నేత ఇ.పెద్దిరెడ్డి, కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావులు పోటీపడ్డారు. తనదంటే తనదంటూ పెద్దిరెడ్డి, మందాడి శ్రీనివాసరావులు బలనిరూపణకు సైతం దిగారు. భారీ ర్యాలీలు నిర్వహించారు. అయితే అనూహ్య రీతిలో కూకట్ పల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా నందరమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరు తెరపైకి వచ్చింది. 

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో నందమూరి కుటుంబం నుంచి కళ్యాణ్ రామ్ బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. శేరిలింగంపల్లి లేదా కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే సినిమాల్లో బిజీబిజీగా ఉండటంతో కళ్యాణ్ రామ్ పోటీకి ఆసక్తి చూపలేదు. 

దీంతో తెలుగుదేశంపార్టీ హరికృష్ణ కుమార్తె సుహాసినిని తెరపైకి తీసుకువచ్చింది. అయితే సుహాసిని అభ్యర్ధిత్వంపై అటు కుటుంబంలో కూడా పెద్ద ఎత్తున చర్చే జరిగింది. అయితే అంతా అంగీకారం తెలపడంతో సుహాసిని గురువారం మధ్యాహ్నం విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు నాయుడను కలిశారు.

కూకట్ పల్లి టిక్కెట్ పై చర్చించారు. సుమారు అరగంట పాటు చర్చించిన అనంతరం సుహాసిని అభ్యర్ధిత్యాన్ని ఆ పార్టీ అధినేత టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఖారరు చేశారు. సుహాసిని అభ్యర్థిత్వం ఖరారు కావడంతో కూకట్‌పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆమె శనివారం (ఈనెల 17)న నామినేషన్ వేయనున్నారు.  

మరోవైపు కూకట్‌పల్లి టిక్కెట్ ఆశించి భంగపడ్డ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు, నియెజకవర్గం కీలక నేతలు అమరావతి వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు.  ఎన్టీఆర్‌ కుటుంబానికి టికెట్‌ ఇస్తున్నందున అంతా సహకరించాలని చంద్రబాబు వారిని కోరారు. ఈ సారికి టికెట్‌ ఇవ్వలేకపోతున్నట్టు మందాడికి వివరించారు. పార్టీకి సేవలందించిన మందాడికి తగిన న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

ఇకపోతే శనివారం సుహాసిని నామినేషన్ కు భారీ స్థాయిలో జనసమీకరణ చేసేందుకు తెలంగాణ టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. సుహాసిని నామినేషన్ సందర్భంగా నందమూరి వారసులు కూడా ఆమె వెంట వచ్చే అవకాశం ఉండటంతో భారీగా జనసమీకరణ చేసి దాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. 

ఈ వార్తలు కూాడా చదవండి

సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్: ప్రచారానికి బాలయ్య, విజయశాంతి జోడి

చంద్రబాబుతో భేటీ: కూకట్‌పల్లి సీటు హరికృష్ణ కూతురు సుహాసినికే

తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ

హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?