కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. కన్న కొడుకు చేతిలో తల్లి దారుణ హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. కొత్తపల్లి మండలం చింతకుంట పంచాయతీ పరిధిలోని వినాయకనగర్‌లో భూక్య రేణుక, ఆమె కుమారుడు కళ్యాణ్‌తో కలిసి నివసిస్తోంది.

Also Read:లాక్ డౌన్ పొడిగించారని...కూతురిని చంపేసిన తండ్రి

రేణుక భర్త భాను ఉపాధి నిమిత్తం రెండేళ్ల కిందట దుబాయ్ వెళ్లాడు. కల్యాణ్ స్థానికంగా టైల్స్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా తల్లి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న కళ్యాణ్‌ తరచుగా రేణుకతో గొడవపడ్డాడు.

ఈ నేపథ్యంలో శనివారం ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన కళ్యాణ్.. టవల్‌తో తల్లి గొంతును బిగించి హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

Also Read;లాక్ డౌన్ సమయంలో మద్యం కోసం... కన్నతల్లిని హత్యచేసిన కసాయి కొడుకు

మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా తల్లిని హత్య చేసిన అనంతరం నిందితుడు కళ్యాణ్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లుగా తెలుస్తోంది.